Lemon Water: సాధారణంగా ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే ఆ నీటిలో నిమ్మరసం కలిపి (Lemon Water) తాగడం వల్ల దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. నిమ్మకాయలో ఉండే పోషకాలు మీ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. సరైన పద్ధతిలో నిమ్మకాయ నీటిని రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నిమ్మకాయలో లభించే అనేక పోషకాలు మీ ఆరోగ్యానికి సర్వతోముఖంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. మీరు సరైన మోతాదులో.. సరైన విధానంలో నిమ్మకాయను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
నిమ్మకాయ నీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బరువు తగ్గడం: ప్రతిరోజూ ఉదయం నిమ్మ నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే పదార్థాలు శరీర మెటబాలిజమ్‌ను పెంచుతాయి. తద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతో పాటు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మ నీటిని తాగడం మంచిది.
శరీరాన్ని డిటాక్స్ చేయడం: నిమ్మ నీరు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి (detox) సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం శుభ్రపడుతుంది.
రోగనిరోధక శక్తి: మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే నిమ్మ నీటిని తాగడం ద్వారా దానిని గణనీయంగా మెరుగుపరచవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గట్ హెల్త్, చర్మ సౌందర్యం: నిమ్మ నీటిలో ఉండే పోషకాలు గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
నిమ్మ నీటిని ఎలా తయారు చేయాలి?
నిమ్మ నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ అలవాటుతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.