’75 Hard’ Challenge : హాస్పటల్ పాలై ఛాలెంజ్..ఇదేం విడ్డూరం

ఈ ఛాలెంజ్ లో రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి. అంతే కాకుండా 45 నిమిషాల పాటు రెండు సార్లు వర్కౌట్లు చేయాలి

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 02:25 PM IST

ఇటీవల కాలంలో మనుషుల్లో అత్యాశ ఎక్కువైపోయింది. రాత్రికిరాత్రే గొప్పవారై పోవాలని , కోటీశ్వరులు కావాలని, పాపులర్ కావాలని భావిస్తున్నారు. ఆ కోరిక తో ఏంచేస్తున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా లో మరి దారుణాలు చేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాపులర్ కావాలని తపించిపోతున్నారు. పాపులర్ కావడం ఏమోకానీ ముందుగా హాస్పటల్ పాలై..డాక్టర్స్ చేత చివాట్లు తింటున్నారు.

ఈ మధ్య రకరకాల పేర్లతో ఛాలెంజ్ లు చేస్తున్నారు. తాజాగా కెనడా (Canada)లో 75 హార్డ్‌ అనే ఫిట్నెస్ ఛాలెంజ్‌ (’75 Hard’ challenge)ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఈ ఛాలెంజ్ లో రోజుకు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి. అంతే కాకుండా 45 నిమిషాల పాటు రెండు సార్లు వర్కౌట్లు చేయాలి. ఆలా చేసినట్లు వీడియో తీసి పోస్ట్ చేయాలి. ఇలా దాదాపు 12 రోజులు చేయాలి. ఆలా చేస్తే ఈ ఛాలెంజ్ లో విజయం సాధించినట్లు.

దీనిని కెనాడకు చెందిన మిచెల్‌ ఫెయిర్‌బర్న్‌ (Michelle Fairburn) అనే టిక్‌ టాక్ (Tiktoker ) స్టార్‌ స్వీకరించింది. ప్రతి రోజు ఇలా చేస్తూ వచ్చింది. కానీ చివరి 12 వ రోజున మాత్రం ఒంట్లో ఏదో తేడా కొట్టడం తో హాస్పటల్ (hospital)కు పరుగులుపెట్టింది. ఈమెను గమనించిన డాక్టర్స్ ఒంట్లో సోడియం పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని , రోజుకు కేవలం అరలీటర్ నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు. దీంతో చేసేదేం లేక డాక్టర్స్ చెప్పినట్లు అరలీటరు వాటర్ తాగుతున్నట్లు తెలిపింది. అయినప్పటికీ ఈ ఛాలెంజ్ ని మాత్రం వదలనని, ఫస్ట్ టైం కాబట్టి ఓడిపోయా..రెండోసారి ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పుకొస్తుంది. ప్రాణం మీదకు వచ్చిన పంతం మానవా..అని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్‌ పక్షులు