వింటర్ (Winter) సీజన్ రొమాంటిక్ గా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. శీతాకాలంలో జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కడుపు సక్రమంగా పనిచేస్తుందో అప్పుడే తిండి కూడా బాగా తినాలని అనిపించడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే వింటర్ (Winter) సీజన్ లో హెవీ, ఆయిల్, స్పైసీ ఫుడ్ ను విస్మరించడం మంచిది. దీనితో పాటు ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. శీతాకాలంలో ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
▶ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని ఉదయాన్నే తీసుకుంటే, ఆ రోజంతా చక్కగా సాగుతుంది. శీతాకాలంలో గుడ్డు, బ్రౌన్ బ్రెడ్ శాండ్‌విచ్, ఉప్మా, దోసె, ఇడ్లీ వంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకోవాలి.
▶ మీకు కావాలంటే, మీరు అల్పాహారంలో కూరగాయల లేదా ఫ్రూట్ సలాడ్ తినవచ్చు. చలికాలంలో అల్పాహారం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. బ్రేక్ పాస్ట్ తర్వాత వేడి పాలు తాగడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు.
▶ శీతాకాలంలో, మీరు పచ్చి కూరగాయలు, రోటీ, తాజా పెరుగు లేదా మజ్జిగ, పొట్టు తీసిన పప్పుతో అన్నం, మధ్యాహ్న భోజనంలో వేడి వేడి సూప్ తీసుకోవచ్చు. విటమిన్ సి , ప్రోటీన్లు కూరగాయలలో పుష్కలంగా లభిస్తాయి, కాబట్టి అవి ఆరోగ్యానికి ఉత్తమమైనవి.
▶ చలికాలంలో వేరుశెనగలు, బాదంపప్పులను తప్పనిసరిగా తీసుకోవాలి, ఎందుకంటే వేరుశెనగలో ప్రోటీన్లు, ఫైబర్, ఖనిజాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి.
▶ చలికాలంలో శెనగపిండి, దేశవాళీ బెల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. రక్తం స్థాయి పెరుగుతుంది. బెల్లం వల్ల అనీమియా నుంచి కూడా దూరమవ్వచ్చు. అందుకే బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
▶ శీతాకాలంలో రాత్రిపూట తొందరగా ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, ఈ సీజన్లో డిన్నర్ లైట్ తీసుకోవడం మంచిది. మీరు డిన్నర్‌లో ఏదైనా గ్రీన్ వెజిటేబుల్, రోటీ, చట్నీ, సలాడ్‌ని చేర్చుకోవచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో డైజేషన్ సీస్టం డౌన్లో ఉంటుందని తెలుసు కదా..
▶ శీతాకాలంలో నిద్రించే ముందు, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు, కరుక్కాయా లేదా అల్లం కలిపి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని తక్కువ అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇది ఎంతో అవసరం.
Also Read: South India : అన్నం వడ్డించడానికి అరటి ఆకును ఎందుకు వాడుతారో తెలుసా?