మనం ఎప్పుడూ ఉదయం(Morning) సమయంలో అల్పాహారం తప్పనిసరిగా తినాలి అయితే అది పోషకాలతో కూడినది అయి ఉండాలి. ఈ అల్పాహారాలను(Tiffins) రోజూ తింటే మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే ఈ టిఫిన్స్ తినడం వలన ఎనర్జీ వస్తుంది.
మొదటిది ఓట్స్ ఇడ్లీ(Oats Idly).. మనం ఇడ్లీ చేసుకునే రవ్వలో ఓట్స్ కలిపి చేసుకోవాలి. ఇంకా దీనిలో జీలకర్ర, ఆవాలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వంటివి కలిపితే ఇడ్లీ ఇంకా రుచిగా ఉంటాయి. అప్పుడు మామూలు ఇడ్లీకి ఓట్స్ ఇడ్లీకి తేడా ఉండదు. ఓట్స్ ఇడ్లీని కూడా చట్నీ లేదా సాంబార్ తో తినవచ్చు.
ఇంకొక అల్పాహారం క్వినోవా ఉప్మా(Quinoa Upma). క్వినోవాలలో టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కొత్తిమీర అన్నీ వేసి ఉప్మాలాగ తయారుచేసుకోవచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది ఇంకా అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది.
శనగల సలాడ్.. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. శనగలను ఉడికించి దానిపై ఉప్పు, కారం వేసి తాలింపు పెట్టుకొని దాని పైన నిమ్మకాయ రసం జల్లుకొని తింటే చాలా బాగుంటుంది.
పెసరపప్పు దోస ఇది కూడా చాలా బాగుంటుంది. పొట్టు పెసరపప్పుతో అయినా దోసలకు వాడుకోవచ్చు. ఈ దోస క్రిస్పీ గా ఉంటుంది. పెసరపప్పు దోస కూడా చట్నీతో తినొచ్చు.
పన్నీర్ బుర్జీ.. అంటే పన్నీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు, గరం మసాలా అన్నే కలిపి కూర లాగా వండుకోవాలి దీనిని చపాతీ కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మన ఆరోగ్యానికి పోషకాలు అందించే ఆహారం.
Also Read : Soaked food: రాత్రిపూట ఈ పదార్థాలు నానబెట్టి తింటే చాలు.. ఆ సమస్యలని పరార్?