Medicines will be Cheaper: ఈ మందులు ఏప్రిల్ 1 నుంచి చౌక.. దిగుమతి సుంకం రద్దు

నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021 కింద జాబితా చేయబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం దిగుమతి చేసుకున్న మందులు, ప్రత్యేక ఆహారంపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని..

Medicines will be Cheaper : ఏప్రిల్ 1 నుంచి అన్నీ ఇబ్బంది పెట్టే ఇష్యూలే ఉన్నాయని వార్తలు వింటున్న సామాన్యుడికి ఒక గుడ్ న్యూస్. కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై విదేశాల నుంచి మందులను దిగుమతి చేసు కోవాల్సి వస్తున్న వారికి భారత ప్రభుత్వం ఎంతో ఊరట నిచ్చింది. నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021 కింద జాబితా చేయబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం దిగుమతి చేసుకున్న మందులు, ప్రత్యేక ఆహారంపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి ఫారిన్ నుంచి మందులు (Medicines) తెప్పించుకునే స్థాయి రిచ్ క్లాస్ ప్రజలకే ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల పేదలకు నో బెనిఫిట్.

డిస్కౌంట్ యొక్క ప్రయోజనాన్ని ఎలా పొందాలి?

వ్యక్తిగత ఉపయోగం కోసం ఔషధాలను ఫారిన్ నుంచి దిగుమతి చేసుకునే వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెంబ్రోలి జుమాబ్ (కీట్రూడా)పై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ప్రయోజనాన్ని పొందడానికి, వ్యక్తిగత దిగుమతిదారు సెంట్రల్ లేదా స్టేట్ హెల్త్ సర్వీస్ డైరెక్టర్, జిల్లా మెడికల్ ఆఫీసర్ లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి.

పన్ను ఎంత?

ఫారిన్ నుంచి దిగుమతి చేసుకునే అటువంటి మందులపై 10 శాతం ప్రాథమిక సుంకం విధించ బడుతుంది. అయితే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ , ఇంజెక్షన్లపై 5 శాతం పన్ను వేస్తారు.  వెన్నెముక కండరాల క్షీణత లేదా డుచెన్ కండరాల బలహీనత చికిత్స కోసం కొన్ని ఔషధాలకు ఇప్పటికే మినహాయింపు ఇస్తున్నారు. అయితే ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల కోసం కస్టమ్ డ్యూటీ రిలీఫ్ కోసం కేంద్రం అనేక అభ్యర్థనలను స్వీకరించింది. వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. PIB ప్రకారం..కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు సంవత్సరానికి 10 కిలోల బరువున్న పిల్లలకు 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయలకుపైగా ఖర్చు అవుతుంది. ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపు దేశంలోని చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read:  Boy’s Weight Record: 200 కిలోల నుంచి 114 కిలోలకు.. ఎలా సాధ్యమైంది?