Immunity : వీటికి దూరంగా ఉండండి.. లేదా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది..

ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా సమయంలో ఎవరికైతే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందో వారే తట్టుకోగలిగారు.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 08:12 PM IST

మనం బలంగా ఉండాలంటే మనకు ఇమ్యూనిటీ(Immunity) అధికంగా ఉండాలి దాని వలన మనకు ఏదయినా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాము. ఈ మధ్య కాలంలో వచ్చిన కరోనా సమయంలో ఎవరికైతే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందో వారే తట్టుకోగలిగారు. కాబట్టి మనం ఇమ్యూనిటీ పెంచుకునే ఆహారపదార్థాలను తింటూ ఉండాలి. అదే విధంగా ఇమ్యూనిటీని తగ్గించే ఆహారపదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

మనం అందరం ఎక్కువగా ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంది. కానీ అది మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే టీ మరియు కాఫీలలో ఉండే కెఫీన్ రోగనిరోధక శక్తిని(Immunity Power) తగ్గిస్తుంది. ఇది ఆ సమయానికి ఉత్తేజానిచ్చినా ఆ తర్వాత శరీరాన్ని బలహీనపరుస్తుంది. మనం రోజూ తాగేటటువంటి కూల్ డ్రింక్స్ వలన కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఎందుకంటే కూల్ డ్రింక్స్ లలో ఎక్కువ చక్కెరను వాడతారు. అది మన శరీరంలో రోగనిరోధకశక్తిని తగ్గించేలా చేస్తుంది.

ఇక మందు, సిగరెట్ వంటి అలవాట్లు ఉన్నవారికి ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోతుంది. మందు, సిగరెట్ తాగడం వలన ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. మనకు ఏమైనా పొట్టకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. జంక్ ఫుడ్, స్పైసీగా ఉండేవి తినడం వలన కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. కాబట్టి మనం ఇమ్యూనిటీని మన శరీరంలో తగ్గకుండా ఉంచుకోవడానికి మన ఆహారపదార్థాలలో మార్పులు చేసుకోవాలి. లేకపోతే ఇమ్యూనిటీ తగ్గి తొందరగా ఏదో ఒక అనారోగ్య సమస్యకు గురవుతూ ఉంటారు. కాబట్టి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, మందు, సిగరెట్ వంటివి తగ్గించుకోవాలి.

 

Also Read : Pistachio Benefits: చలికాలంలో పిస్తా ప్రయోజనాలు

Follow us