Toilet: సాధారణంగా ఇంట్లో అత్యంత మురికి ప్రదేశం బాత్రూమ్ అని, అపరిశుభ్రమైన వస్తువు టాయిలెట్ (Toilet) సీటు అని మనం అనుకుంటాము. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇంటి టాయిలెట్ కంటే కూడా మనం రోజూ ఉపయోగించే ఐదు వస్తువులు మురికితో నిండి ఉంటాయని తెలిపారు. నిపుణులు మాట్లాడుతూ.. సరైన విధంగా శుభ్రం చేయకపోతే మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే అత్యంత మురికి వస్తువులు ఏవో వెల్లడించారు. బ్యాక్టీరియాతో నిండిన ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం.
టాయిలెట్ కంటే మురికిగా ఉండే 5 వస్తువులు
టీవీ రిమోట్ (TV Remote)
డాక్టర్లు చెప్పిన ప్రకారం.. టీవీ రిమోట్ మురికితో నిండి ఉంటుంది. తరచుగా దీనిని జిడ్డుగల చేతులతో తాకుతాం. కానీ సరిగా శుభ్రం చేయం.
కటింగ్ బోర్డు (Cutting Board)
కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను కత్తిరించడానికి కటింగ్ బోర్డు లేదా చాపర్ బోర్డును ఉపయోగిస్తారు. అయితే కటింగ్ బోర్డును కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టకుండా ఉంచితే ఆహారపు చిన్న ముక్కలు దానిపైనే ఉండిపోయి.. అక్కడ బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది.
స్మార్ట్‌ఫోన్ (Smartphone)
ఆహారం తినే టేబుల్ నుండి టాయిలెట్ సీటు వరకు ఫోన్‌ను దాదాపు అన్ని చోట్లా ఉపయోగిస్తారు. అలాగే బస్సులు, క్యాబ్‌లు, స్నేహితుల కారు వంటి ప్రజా రవాణాలో కూడా ఫోన్ మనతోనే ఉంటుంది. కానీ దీనిని కూడా సరిగ్గా శుభ్రం చేయరు.
Also Read: SBI కార్డ్ కొత్త ఛార్జీలు.. తెలుసుకోకపోతే మీ బ్యాంకు ఖాతా ఖాళీ !!
దిండు కవరు (Pillow Cover)
నోటి లాలాజలం నుండి శరీర చెమట వరకు ఇవన్నీ దిండు కవరుపై పేరుకుపోతాయి. దిండు కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఈ మురికి ఎల్లప్పుడూ దిండుపై అంటిపెట్టుకుని ఉండి, మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది.
కిచెన్ స్పాంజ్ (Kitchen Sponge)
పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజ్ అత్యంత మురికిగా ఉంటుంది. ఇది ఎప్పుడూ తడిగా ఉంటుంది. దీనిపై ఎప్పుడూ మురికి అతుక్కుని ఉంటుంది. పైగా బ్యాక్టీరియా కూడా పెరుగుతూ ఉంటుంది. మొత్తం ఇంట్లో ఎంత శుభ్రం చేసినా.. ఈ 5 వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.