Himalayan Herbs : హిమాలయాలు.. అందానికే కాదు.. ఆరోగ్యాన్ని అందించే మూలికలు, ఔషధ మొక్కలకు కూడా నిలయం. మన ఆయుష్షును పెంచే ఎన్నో మూలికలు వీటిలో ఉన్నాయి. హిమాలయాల్లో లభ్యమయ్యే విలువైన మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- ‘తిప్పతీగ’ను గిలోయ్ అని అంటారు. గిలోయ్ అంటే.. వృద్ధాప్యాన్ని నిరోధించే అమృతం అని అర్థం. ఈ మొక్క కాండంలోని ఫైటోకెమికల్స్ మన కీళ్లవాపుల్ని నివారిస్తాయి. గోరువెచ్చని పాలలో పావు లేదా అర టీ స్పూను తిప్పతీగ పొడి వేసుకుని తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
- ‘తులసి ఆకుల్ని’ నోట్లో వేసుకొని నమిలితే జలుబు, ఫ్లూ రాదు. ఇవి శరీరంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తాయి. హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. తులసి ఆకులను మజ్జిగలో కలిపి తాగితే బరువు తగ్గుతారు.
- ‘షిలాజిత్’ అనేది ఒక జిగట రెసిన్. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. షిలాజిత్‌ను నీటిలో వేసుకొని తాగొచ్చు.
- ‘అశ్వగంథ’ను వేల సంవత్సరాల నుంచీ ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఇది మధుమేహ సమస్యల్ని నిరోధిస్తుంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. నిద్రలేమినీ కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుంది.
- ‘బ్రహ్మి’.. మెదడు పనితీరును బెటర్ చేస్తుంది. గోరువెచ్చని నీటిలో బ్రాహ్మి ఆకుల కషాయాలను తయారు చేసి ఉదయం పూట తాగాలి.
- ‘శతావరిని’లో ఎ, సి, కె, బి6 విటమిన్లు ఉంటాయి. ఇందులోని క్రోమియం అనే ఖనిజం రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా అడ్డుకుంటుంది. అండాల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి ఇది సాయంచేస్తుంది. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. తల్లి పాలివ్వడంలో ముఖ్యమైన ప్రొలాక్టిన్ ఉత్పత్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. శతావరి పొడిని తేనె, పాలతో కలిపి తీసుకోవచ్చు.
- ‘గుగ్గుల్’ అనేది జిగురు పదార్థం. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో పావు స్పూన్ ‘గుగ్గుల్’ వేసుకుని తాగితే మేలు(Himalayan Herbs) జరుగుతుంది.