Site icon HashtagU Telugu

These Foods Causes Brest Cancer: ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి.. తింటే అటువంటి జబ్బు వచ్చే ప్రమాదం?

These Foods Causes High Risk Of Breast Cancer

These Foods Causes High Risk Of Breast Cancer

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ లో కూడా అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇదివరకు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు నమోదు అయ్యేవి. కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఆక్రమించింది ‘డబ్ల్యూహెచ్ఓ’ సంస్థ వెల్లడించింది. ఇతే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇండియా సంస్థ చెబుతున్న విషయాలను వింటే నోరెళ్ళ పెట్టాల్సిందే.

ఎందుకంటే ప్రతి నాలుగు నిమిషాలకు భారత్ లో ఒక మహిళకు బ్రెస్ట్  క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. అంతే కాకుండా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారు అని బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా పేర్కొంది. అయితే ఇలా రొమ్ము క్యాన్సర్ కు ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతాయట. మరి రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, నట్స్, చిక్కుళ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినేవారి కంటే బియ్యం తదితర రిఫైన్డ్ ధాన్యాలు, పిండితో చేసిన పదార్థాలు, బ్రెడ్ వంటి వృక్ష సంబంధ ఆహార పదార్థాలు తీసుకునేవారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు మరింత అధికమని ఫ్రెంచ్ వైద్యులు తెలిపారు. ఈ వృక్ష సంబంధ అనారోగ్యకర ఆహార పదార్థాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రతకు దారితీస్తాయని వారు తెలిపారు.

Also Read:-
Intermittent Fasting: ఉన్న వారు ఉపవాసం చెయ్యచ్చా.. సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవా?
Weight Loss : బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా…అయితే నల్ల మిరియాలను ఇలా ఉపయోగించి చూడండి…!!