వర్షాకాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాగే నీటిని వేడి చేసి తాగాలి. వర్షాకాలంలో మాంసాహారం తింటే అరగదు కాబట్టి ఎక్కువగా శాఖాహారం మాత్రమే తినాలి. వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు గుమ్మడికాయ, ఉసిరి, కాకరకాయ, బీన్స్, బెండకాయ. పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన కూరగాయలను వర్షాకాలంలో వాడకూడదు.
గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది. ఇది ఈ కాలంలో తక్కువ ధరకే లభిస్తుంది. గుమ్మడికాయతో కూర, పులుసు, హల్వా, వడియాలు చేసుకొని తినవచ్చు. ఇలా ఏదో ఒక రకమైన వంటకం చేసుకొని గుమ్మడికాయను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వర్షాకాలంలో లభించే బెండకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
వర్షాకాలంలో బీన్స్, చిక్కుడుకాయలు, సోయా బీన్ వంటివి విరివిగా లభిస్తాయి. ఇవి తక్కువ ధరకే లభించడమే కాకుండా మనకు ఆరోగ్యకరంగానూ ఉంటాయి. వీటిలోకి త్వరగా కీటకాలు చేరవు. కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ దానితో కూర, వేపుడు చేసుకొని తినవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు కాకర రసం తాగితే చాలా మంచిది.
ఉసిరిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఉసిరి పచ్చడిని తినవచ్చు. ఉసిరి వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. ఉసిరి పులుపుగా ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం బాగుండేలా, మనకు రుచిగా ఉండేలా వర్షాకాలంలో ఈ కూరగాయలను తినవచ్చు. దీని వలన మన ఆరోగ్యం బాగుంటుంది.
