Site icon HashtagU Telugu

Heart Attack : నిద్రలో గుండెపోటు రాకూడదంటే ఈ జాగ్రత్తలు మస్ట్

Heart Attack

Heart Attack : ఈ మధ్యకాలంలో చాలామందికి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది హార్ట్ ఎటాక్స్‌తో ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలను మనం చూస్తున్నాం. నిద్రలోనూ కొందరు గుండెపోటు బారినపడి తుదిశ్వాస వదులుతున్నారు. గుండెపోటు రిస్కును తగ్గించుకునే కొన్ని ఆరోగ్య సలహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అధిక కొలెస్ట్రా​లే కారణం..

గుండెపోటు(Heart Attack) సమస్యలకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ (కొవ్వు). చెడు కొలెస్ట్రాల్ మోతాదు శరీరంలో పెరిగిపోతే అది గుండె సమస్యలకు దారితీస్తుంది. ధమనులు, సిరలు అనే సన్నటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా వాటి ద్వారా గుండెకు సకాలంలో రక్తం సప్లై కాదు. దీనివల్లే హార్ట్ ఎటాక్స్ సంభవిస్తుంటాయి.  మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే.. కాళ్లు, పాదాలలో దాని లక్షణాలు కనిపిస్తాయి. చిన్న చిన్న గడ్డల లాంటివి పాదాలు, కాళ్లలో వస్తాయి.  ఇలాంటివి కనిపిస్తే డాక్టరును సంప్రదించాలి.  కొలెస్ట్రాల్ మోతాదు లేని ఆహార పదార్థాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి.  శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయి.  ఈ పరిస్థితి ఎదురైనా వెంటనే డాక్టరును సంప్రదించాలి. మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ తరహా సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. సమయానికి ఆహారం తినకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల పురుషులకు గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది.

Also Read :18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్‌పీ జాబ్స్

గుండె ఆరోగ్యం కోసం టిప్స్

Also Read :25 Dead : కల్తీ నాటుసారా తాగి 25 మంది మృతి.. 10 మంది పరిస్థితి విషమం

గుండె మరమ్మతు గుట్టు తెలిసింది

గుండెపోటు వచ్చినప్పుడు మన గుండెలోని కణాలు పెద్దసంఖ్యలో చనిపోతాయి. ఫలితంగా గుండెకు ఉండే రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం చాలావరకు తగ్గిపోతుంది. అయితే జీబ్రా చేపలకు గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు తొలుత చనిపోతాయి. అయితే వెంటనే మళ్లీ అవి వృద్ధి చెందే ప్రక్రియ మొదలవుతుంది. జీబ్రా చేపల్లో గుండెపోటు తర్వాత ఏర్పడే మచ్చ అంత మొండిగా ఉండటం లేదు. వాటిలో గుండెపోటు తర్వాత.. మచ్చ ఏర్పడేందుకు కారణమయ్యే  కొలాజెన్, ప్రొటీన్‌ పోచలు వదులుగా, మళ్లీ విడిపోయేలా ఉంటున్నాయి.  ఫలితంగా ఆ చేపల గుండెలోని ప్రభావిత భాగంలో మచ్చ ఏర్పడిన చోట  కొత్తగా గుండె కణాలు డెవలప్ అవుతున్నాయని తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు గుర్తించారు. మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు వారి గుండెలో మచ్చ గాఢంగా, బిగుతుగా ఏర్పడటంలో లైసీల్‌ హైడ్రాక్సీలేజ్‌ 2 అనే ఎంజైమ్‌ కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు గుర్తించారు.  ఈ ఎంజైమ్‌ను అడ్డుకోగలిగితే.. గుండెపోటు వల్ల మనుషుల గుండెలో ఏర్పడిన మచ్చకు మరమ్మతులు చేయొచ్చని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు నిలుస్తాయన్నారు.