Site icon HashtagU Telugu

Pig Heart -Patient Died : పందిగుండెను అమర్చుకున్న మరో వ్యక్తికి ఏమైందంటే..

Pig Heart Patient Died

Pig Heart Patient Died

Pig Heart -Patient Died :  ఆరువారాల కిందటే (సెప్టెంబరులో) సర్జరీ ద్వారా పందిగుండెను అమర్చుకున్న అమెరికా వ్యక్తి  లారెన్స్ ఫౌసెట్ చనిపోయాడు. దీంతో​మానవ గుండెను పందిగుండె సక్సెస్ ఫుల్‌గా రీప్లేస్ చేయలేదని మరోసారి తేలిపోయింది. తీవ్ర గుండె సమస్యను ఎదుర్కొన్న 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్‌కు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌కు చెందిన వైద్య నిపుణులు ​​పంది గుండెను అమర్చారు. అనంతరం క్రమంగా అతడి ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. చివరకు ఈ సోమవారం సాయంత్రం చనిపోయాడు.

We’re now on WhatsApp. Click to Join.

గతేడాది (2022లో) మేరీల్యాండ్ వైద్యుల బృందం బాల్టిమోర్‌‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌ అనే మరో వ్యక్తికి తొలిసారిగా పందిగుండెను అమర్చారు. ఈ గుండె మార్పిడి సర్జరీ చేసిన రెండు నెలల తర్వాత బెన్నెట్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మానవ అవయవాల కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 2022లో  కేవలం 4,100 గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పందిగుండెతో గుండె మార్పిడి సర్జరీలను అక్కడి శాస్త్రవేత్తలు ట్రై చేశారు. అవి ఫెయిల్ (Pig Heart -Patient Died) అయ్యాయి.

Also Read: Aadhaar : మీ ఆధార్ ను లాక్ చేసుకోలేదా..? అయితే మీ డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త..