Site icon HashtagU Telugu

Cough Syrups : ఆ రెండు దగ్గు మందులను నిషేదించిన తెలంగాణ సర్కార్

Relife Cf Respifresh Tr

Relife Cf Respifresh Tr

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు దగ్గు సిరప్లను Relife CF మరియు Respifresh-TR పై నిషేధం విధించింది. ఇటీవల నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో ఈ రెండు మందుల్లో Diethylene Glycol (DEG) అనే అత్యంత విషపూరిత రసాయన పదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయింది. DEG మన శరీరానికి ప్రమాదకరమైన ప్రభావాలు చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మనిషి శరీరంలో చేరితే మూత్రపిండాలు, కాలేయం వంటి కీలక అవయవాలకు తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు, మరియు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఇది ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది.

Kantara – Chapter 1 : రూ.400 కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్-1

ప్రభుత్వం తక్షణ చర్యగా ఈ రెండు సిరప్ల విక్రయం, పంపిణీ, వినియోగం పై పూర్తి నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులు, ఫార్మసీలు ఈ ఉత్పత్తులను వెంటనే తమ దుకాణాల నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మందులను ఇప్పటికే కొనుగోలు చేసిన వారు వాటిని వాడకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు లేదా డ్రగ్ కంట్రోల్ అధికారులకు అప్పగించాలని సూచించింది. ఆరోగ్య శాఖ అధికారులు ఈ నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని అన్ని జిల్లాలకు పంపారు. ఈ చర్య ద్వారా ప్రజల్లో భయాందోళన కలగకూడదని, కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version