Site icon HashtagU Telugu

GST Council: మిల్లెట్స్ పై 18శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు

Gst Council

Gst Council

GST Council: మిల్లెట్ ఆహార పదార్థాలపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.ప్రస్తుతం పన్ను రేటు 18 శాతం నుంచి మరింత సరసమైన 5 శాతానికి తగ్గించింది. వివరాలు చూస్తే..

మిల్లెట్ ఉత్పత్తులపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి కుదించివేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రేటు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేశారు. మిల్లెట్స్ పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. మిల్లెట్ పిండి ఆహార తయారీలపై జీఎస్టీ (GST) రేటును తగ్గించడం ద్వారా ఈ పోషకమైన ఆహార పదార్థాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా క్రమంగా మిల్లెట్ పిండి ఆహార వినియోగం పెరుగుతుంది. అలాగే ప్రజలు ఆరోగ్యంపై దృష్టిపెడతారని కేంద్రం భావిస్తుంది.

Also Read: Asian Games 2023 : Ind vs Afg.. ఫైనల్ మ్యాచ్ రద్దు స్వర్ణం గెలుచుకున్న భారత్..!