Food for Energy : నీరసంగా అనిపించి ఏ పనిని చేయలేకపోతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..

బలహీనంగా అనిపించే వారు ఏ సీజన్లో వచ్చే పండ్లను(Fruits), కూరగాయలను(Vegitables) ఆ సీజన్లో తినాలి. శరీరానికి అవసరమైన యాంటి ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
take these foods for energy must eat for gaining energy

take these foods for energy must eat for gaining energy

ప్రస్తుతం అందరూ హడావుడిగా టైమ్ కి ఏదో తినడం చేస్తున్నారు. కానీ మనం అలా తినడం వలన మన శరీరానికి కావలసిన పోషకాలు అందవు. కాబట్టి మనకు నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. బలహీనంగా ఉండడం వలన మనం ఏ పనిని సక్రమంగా చేయలేకపోతాము మనకు ఏకాగ్రత దెబ్బతింటుంది. మన శరీరం బలహీనతకు గురవ్వడానికి మన శరీరంలో విటమిన్ బి 12 లోపం వలన, ఇంకా మనం దేని గురించి అయినా బాగా ఆలోచించి దిగులు చెందడం, డిప్రెషన్ వలన కూడా నీరసంగా తయారవుతారు.

బలహీనంగా అనిపించే వారు ఏ సీజన్లో వచ్చే పండ్లను(Fruits), కూరగాయలను(Vegitables) ఆ సీజన్లో తినాలి. శరీరానికి అవసరమైన యాంటి ఆక్సిడెంట్లు ఈ పండ్లలో ఉంటాయి. పండ్లను తినడం వలన డీహైడ్రాషన్ సమస్య ఉండదు. లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వలన మన శరీరంలో బలహీనత తగ్గుతుంది. ఆహారంలో చేపలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు వంటి వాటిలో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని తినడం వలన మన శరీరంలో బలహీనత తగ్గుతుంది. అలా జంక్ ఫుడ్ తినడానికి ఆ సమయంలో బాగున్నా ఆ తర్వాత శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి తగ్గించాలి.

ప్రతిరోజూ ఉదయం సమయంలో బాదం పప్పులు లేదా నట్స్, తృణధాన్యాలు వంటివి తింటే మన శరీరంలో బలహీనత తగ్గుతుంది. అలాగే కొంతమంది పెరుగు తినకుండా ఉంటారు దీని వలన కూడా మనం అలసటకు లేదా బలహీనతకు గురవుతాము. కాబట్టి మనం వానాకాలం అయినా లేదా చలికాలం అయినా కూడా రోజూ ఆహారంలో పెరుగు ను భాగంగా చేసుకోవాలి. అలాగే సాయంత్రం పూట బజ్జిలు, పునుగులు లాంటివి కాకుండా పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలా మనం తినే ఆహార పదార్థాలను బట్టి కూడా మనలోని బలహీనతను తగ్గించుకొని ఎనర్జీ తెచ్చుకోవచ్చు.

 

Also Read : Sorakaya Pappu: సొరకాయ పప్పు.. తయారీ విధానం ఇదే?

  Last Updated: 27 Aug 2023, 09:26 PM IST