Site icon HashtagU Telugu

Heart Attack Symptoms: గుండెపోటు వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలివే..!

Heart Attack

Heart Attack

Heart Attack Symptoms: ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు (Heart Attack Symptoms) బారిన‌ప‌డుతున్నారు. దీంతో ప్రజలు కోలుకునే అవకాశం కూడా లేని పరిస్థితి నెల‌కొంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి మరణానికి దారి తీస్తుందని భావించే వారు మన మధ్య చాలా మంది ఉన్నారు. కాబట్టి దాని గురించి సరైన సమాచారం ఉండాలి. తద్వారా గుండెపోటు నుంచి మ‌న‌ల్ని మ‌నం రక్షించవచ్చు. మీరు గుండెపోటుకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం గుండెపోటుకు ఒక వారం ముందు కొన్ని సంకేతాలను చూపుతుంది. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు

ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం

ఎక్కువ‌గా ఛాతీ నొప్పి ఒత్తిడికి గురికావ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ ఛాతీ నొప్పిని ఎక్కడైనా అనుభవించవచ్చు. కానీ సాధారణంగా ఇది ఎడమ వైపున అనిపించవచ్చు. ఈ నొప్పి మీ ఎడమ చేయి, భుజం, దవడ లేదా నడుముకు కూడా వ్యాపిస్తుంది.

Also Read: Unnao Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు..!

శ్వాస ఆడకపోవటం

మీరు అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తే ముఖ్యంగా ఛాతీ నొప్పితో పాటుగా ఉంటే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

అలసిపోవ‌టం

గుండెపోటుకు ముందు మీరు చాలా అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూడా ఈ అలసట రావచ్చు.

తలతిరగడం

గుండెపోటుకు ముందు మైకము, విచిత్రమైన చంచల భావన సంభవించవచ్చు. మీ రక్తపోటు తగ్గడం వల్ల కూడా ఇది జరుగుతుంది. కాబట్టి మీ బీపీని చెక్ చేసుకోండి.

వికారం లేదా వాంతులు

గుండెపోటుకు ముందు వికారం లేదా వాంతులు కూడా సంభవించవచ్చు. ఇది బలహీనమైన అనుభూతికి దారితీయవచ్చు. మీరు నిరంతరం అజీర్ణం వంటి సమస్యలను కలిగి ఉండవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

చెమట

గుండెపోటుకు ముందు అకస్మాత్తుగా చెమట సంభవించవచ్చు. ఎటువంటి కారణం లేకుండా మీకు బాగా చెమటలు పట్టవచ్చు. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు.

ఈ చిట్కాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.