దేశంలో కరోనా (Corona) మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ, గులియన్ బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome ) కొత్తగా కలవరపెడుతోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన ఈ వ్యాధి క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 163 మందికి ఈ వ్యాధి నిర్ధారణ కాగా, ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు జీబీఎస్ కారణంగా మృతిచెందడంతో, రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 5కి చేరుకుంది.
Gold is Gold : గోల్డ్ ఈజ్ గోల్డ్.. ఏటా 8 శాతం రిటర్నులు.. పెట్టుబడిగా బెస్ట్
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిందని ప్రకారం.. సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తం 127 కేసులు ధృవీకరించబడగా, మరో 47 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 47 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా, 21 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పుణే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 168 నమూనాలను సేకరించి నేషనల్ ల్యాబ్‌కు పంపించారు. ఈ పరిశోధనల్లో ఎనిమిది నీటి వనరులు కలుషితమైనట్టు గుర్తించారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా జీబీఎస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల అసోంలో తొలి మరణం నమోదు కాగా, తెలంగాణలో మొదటి కేసు బయటపడింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. జీబీఎస్ సోకిన వ్యక్తులకు జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి, నీరసం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీరు ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది కరోనా మాదిరిగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదని చెబుతున్నారు.
Astrology : ఈ రాశివారు నేడు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు
ఈ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే… స్వచ్ఛమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు మాత్రమే తీసుకోవాలి. జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.