Site icon HashtagU Telugu

Summer : సమ్మర్ లో మీరు చురుకుగా ఉండాలంటే ఇవి తినాలసిందే

Summer Season

Summer Season

వేసవి (Summer ) కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో శరీరంలో నీరు తగ్గిపోవడం, డిహైడ్రేషన్ సమస్యలు రావడం సహజం. దీనివల్ల చాలా మంది అలసటకు గురై శక్తిని కోల్పోతారు. అయితే శరీరానికి తక్షణ శక్తిని అందించే కొంతమంది సూపర్ ఫుడ్స్‌ను తీసుకుంటే, ఈ సమస్యలను అధిగమించవచ్చు. అరటి పండ్లు, గ్రీన్ టీ, పాలకూర, చియా సీడ్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్ వంటి ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి శక్తిని పెంచుతాయి.

Hyderabad : బాలీవుడ్ నటిపై దాడి

అరటి పండ్లలలో పొటాషియం మరియు కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తాయి. గ్రీన్ టీ అలసటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే విశేష గుణాలను కలిగి ఉంది. పాలకూర ఐరన్‌ను సమృద్ధిగా కలిగి ఉండటంతో రక్తహీనత సమస్య ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చియా సీడ్స్ ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ను అందించి శరీరానికి శక్తిని ఇచ్చే అద్భుతమైన ఆహారంగా నిలుస్తాయి.

ఇక డార్క్ చాక్లెట్ చిన్న ముక్క రోజూ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడి శరీరంలో ఎనర్జీ స్థాయులు పెరుగుతాయి. ఇది అలసటను తగ్గించి దృష్టిని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది. ఓట్స్ ఫైబర్ అధికంగా కలిగి ఉండటంతో దీన్ని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతి రోజు తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ సమస్యలు నివారించుకోవచ్చు, శక్తివంతంగా రోజంతా చురుకుగా ఉండొచ్చు.