Site icon HashtagU Telugu

Cool Foods : చలువ‘ధనం’ కావాలా ? పోషక బలం కావాలా ?

Cool Foods

Cool Foods

Cool Foods : వేసవి అంటేనే భానుడి భగభగలు.  సూర్యుడు నిప్పులు కక్కుతుంటే.. మనం చెమటలు కక్కుతుంటాం. అంత రేంజులో ఎండలు మండిపోతుంటాయి. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ మనం కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తచర్యలను తప్పకుండా పాటించాలి. మనం తీసుకునే ఆహారంపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్‌ మన రోజువారీ డైట్‌లో  చేర్చుకుంటే మన శరీరానికి చలువ చేస్తుంది. చెమట రూపంలో మన శరీరం నుంచి ఆవిరయ్యే నీటిని తిరిగి భర్తీ చేసే ఫుడ్స్‌ను తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తాగాలి. మనల్ని కూల్‌గా ఉంచే కూల్ ఫుడ్స్(Cool Foods)గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

కొబ్బరి నీళ్లు

మనం ఈ సమ్మర్‌లో కూల్ డ్రింక్స్‌కు గుడ్ బై చెప్పి కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. కూల్ డ్రింక్స్‌లో వివిధ రకాల ఫ్లేవర్స్, ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి లాంగ్ టర్మ్‌లో చేటు చేస్తాయి. శరీరంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం బెటర్. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. కొబ్బరి నీరు మన శరీరం యొక్క ద్రవ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. మనల్ని చల్లగా ఉంచుతుంది. మన జీర్ణక్రియ బెటర్‌గా ఉండటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. బాడీలో  ఎలక్ట్రోలైట్‌లను పునరుద్ధరించడానికి కొబ్బరి నీళ్లు దోహద పడుతుంది.

పుచ్చకాయ

సమ్మర్‌లో ప్రజల హాట్ ఫేవరేట్ ఫ్రూట్ పుచ్చకాయ.  ఇందులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ, పొటాషియం కూడా దీని ద్వారా మన శరీరానికి లభిస్తాయి. పుచ్చకాయ తింటే శరీరానికి చలువ లభిస్తుంది. బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహణలో ఇది సహాయపడుతుంది.

Also Read :80 Earthquakes : 80 సార్లు కంపించిన భూమి.. పేకమేడల్లా కూలిన భవనాలు.. ఎక్కడంటే ?

పనస పండు

సూపర్ ఫుడ్ అని పిలవదగిన ఫ్రూట్ పనస పండు. ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తిని పునరుద్ధరిస్తుంది. వేడిని ఎదుర్కొనేలా శరీరానికి శక్తిని అందిస్తుంది. పనస పండులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే చర్మ సమస్యలు, హైబీపీ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

కీర దోసకాయ

ఏ విటమిన్, సీ విటమిన్,  కే విటమిన్‌లతో  కూడిన కీర దోసకాయను తింటే సమ్మర్ టైంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో నీటి మోతాదు ఎక్కువ. మన బాడీ టెంపరేచర్‌ను కీర దోస కంట్రోల్‌లో ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా చేస్తుంది. కీర దోసకాయ ముక్కలను సలాడ్‌లలో కలుపుకొని తినొచ్చు. పుదీన, నిమ్మకాయలు, కీర దోసకాయ ముక్కలు కలిపి జ్యూస్ చేసుకొని తాగొచ్చు.

కూరగాయలు

సమ్మర్ టైంలో  మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. కాకరకాయ, గుమ్మడికాయ, టమాటాలు, పొట్లకాయ వంటి కూరగాయలు తింటే శరీరానికి చలువదనం లభిస్తుంది. తగిన పోషకాలు కూడా బాడీకి అందుతాయి. దోసకాయలు, బీన్స్, స్క్వాష్, బెర్రీలు కూడా తినడం మంచిది.

Also Read :Mango : మామిడికాయలను తినడానికి ముందు నీళ్లలో ఎందుకు నానబెట్టాలి?

Exit mobile version