Brain Health: నేటి బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ తమ మనస్సు ప్రశాంతంగా ఉండాలని, జ్ఞాపకశక్తి కూడా పదునుగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి మనిషి దినచర్యలో చాలా పనులు ఉన్నాయి. వాటికి ప్రశాంతమైన మనస్సు అవసరం. మనిషి జీవితంలో మెదడు (Brain Health)కు చాలా ప్రాముఖ్యత ఉంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం ఎంత అవసరమో.. అలాగే మన మెదడు కూడా సరిగ్గా పనిచేయడానికి పోషకాహారం అవసరం. మీ ఆహారంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవడం ద్వారా మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని మీకు తెలుసా? కొన్ని ప్రత్యేక విషయాలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆ జాబితాలో ఏం ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పచ్చని ఆకు కూరలు
మనకు దొరికే ఆకుపచ్చని ఆకు కూరలలో విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
బ్లూ బెర్రీస్
మెదడుకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు బ్లూబెర్రీస్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును పెంచి, వయసు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
Also Read: N Convention Demolition : రూ.400 కోట్లు ఇవ్వనందుకే N కన్వెన్షన్ కూల్చేశారు – బల్క సుమన్
వాల్నట్
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వాల్‌నట్‌లో పుష్కలంగా కనిపిస్తాయి. ఇవి మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది మెదడు కణాలను బలపరుస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
గుడ్డు
గుడ్లు మెదడుకు చాలా ముఖ్యమైన కోలిన్ అనే పోషకాన్ని కలిగి ఉంటాయి. మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కోలిన్ సహాయపడుతుంది. విటమిన్ B12 మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాడీ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బాదం పప్పు
బాదంపప్పులో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.