Types of Milk : పాలల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

పాలు(Milk) తాగడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యామ్నాయంగా అనేక రకాల పాలు ఉన్నాయి. వాటిని తాగడం వలన కూడా మన ఆరోగ్యానికి కాల్షియం, ప్రోటీన్లు అందుతాయి.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 10:30 PM IST

పాలు(Milk) తాగడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అందరూ పాలు తాగడానికి ఇష్టపడరు. చిన్నపిల్లలైతే పాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడరు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అనేక రకాల పాలు ఉన్నాయి. వాటిని తాగడం వలన కూడా మన ఆరోగ్యానికి కాల్షియం, ప్రోటీన్లు అందుతాయి. కేవలం గేదె పాలు, ఆవు పాలే కాకుండా ఇటీవల కాలంలో కొబ్బరి పాలు(Coconut Milk), సోయా పాలు(Soya Milk), బాదం పాలు(Badam Milk), రైస్ మిల్క్, కాజు మిల్క్ లకు డిమాండ్ బాగానే పెరిగింది.

కొబ్బరి పాలను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దానిని మిక్సీ పట్టి పాలను తయారుచేసుకోవచ్చు. ఈ కొబ్బరిపాలను వంటకాలలో ఉపయోగించవచ్చు ఇంకా ఈ కొబ్బరిపాలల్లో పంచదార కలిపి తాగవచ్చు. ఇలా తాగడం వలన మన ఎముకలు బలంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి అదుపులో ఉంటుంది.

సోయా పాలను ఎండిన సొయా బీన్స్ ను నీళ్ళల్లో నానబెట్టి తయారుచేస్తారు. సోయా పాలను తాగడం వలన మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయి. మన శరీరంలో రక్తనాళాలు పటిష్టంగా తయారవుతాయి.

బాదం పాలు.. ఇవి అందరికీ ఇష్టమైనవి. సమ్మర్ లో ఎక్కువగా ఇది తాగడానికి ప్రిఫర్ చేస్తాం. ఈ పాలల్లో అన్ని రకాల విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్ ఉంటాయి. ఈ పాలను తాగడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కాజు మిల్క్ ను కాజు నానబెట్టి తయారుచేసుకోవచ్చు. ఈ పాలు తియ్యగా ఉంటాయి. ఈ పాలల్లో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. ఈ పాలు మన గుండెకు, ఎముకలకు మంచిది.

రైస్ మిల్క్ దీనిని బ్రౌన్ రైస్ తో తయారుచేస్తారు. దీని వలన మన శరీరంలో ఎముకలు బలంగా తయారవుతాయి. రైస్ మిల్క్ ఎంతో రుచిగా ఉంటాయి. పాలు అంటే ఇష్టపడని వారు ఎవ్వరైనా సరే ఇప్పుడు చెప్పుకున్న పాలను తాగవచ్చు. ఇవి ఎంతో రుచిగాను, మన ఆరోగ్యం మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇవే కాక మరిన్ని పాల రకాలు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇలాంటి పాలను ఇంట్లో తయారు చేసుకోలేకపోతే వీటి పౌడర్లు బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి.

 

Also Read : Milk : పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?