Red Light Therapy: వయసు పెరిగేకొద్దీ ముడతలు, వదులుగా ఉండే చర్మం, మచ్చలు, చర్మం మృదుత్వం తగ్గుతాయి. ఈ సమస్యలను దూరంగా ఉంచడానికి అనేక రకాల గృహ, ఆయుర్వేద నివారణలను అవలంభిస్తుంటాం. రెడ్ లైట్ థెరపీ (Red Light Therapy) కూడా వీటిలో ఒకటి. ఈ రోజుల్లో ప్రజలలో దీని ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెడ్ లైట్ థెరపీ అనేది యాంటీ ఏజింగ్ ప్రక్రియ. దీనిలో చర్మంపై ఉండే ఫైన్ లైన్స్, ముడతలు, మచ్చలు రెడ్ లైట్ ద్వారా తొలగిపోతాయి. రెడ్ లైట్ థెరపీ ఫైబ్రోబ్లాస్ట్ కణాల పెరుగుదల, పునరుత్పత్తిని పెంచుతుంది.ఫైబ్రోబ్లాస్ట్‌ల వల్ల కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి అవుతాయని, దీని వల్ల చర్మం మృదువుగా మారి యవ్వనంగా కనిపించటానికి సహాయం చేస్తుంది.
అంటే రెడ్ లైట్ థెరపీ వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంలో కనిపించే లోపాలను సరిచేస్తుంది. ఇది చర్మం కింద వాపును నివారిస్తుంది. కొత్త కణాలు పునరుత్పత్తికి సహాయపడుతుంది.
Also Read: All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?
ఈ చికిత్స ఎలా పని చేస్తుంది?
ఈ చికిత్సలో తక్కువ వేవ్ లెంగ్త్ రెడ్ లైట్ చర్మానికి అందజేయబడుతుంది. చాలా తక్కువ శక్తి ఉపయోగించబడుతుంది. అలాగే సాఫ్ట్ లేజర్ థెరపీ సహాయం తీసుకోబడుతుంది లేదా కోల్డ్ లేజర్ థెరపీని ఉపయోగిస్తారు. ఇది కాకుండా రెడ్ లైట్ థెరపీలో ఫోటోడైనమిక్ థెరపీని కూడా ఉపయోగిస్తారు. ఈ చికిత్సలో ఫోటోసెన్సిటైజర్ ఔషధం తక్కువ శక్తి ఎరుపు లేజర్ కాంతిలో ఉపయోగిస్తారు. ఇది చర్మంలో రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. మొటిమలు, మచ్చలు, చర్మ క్యాన్సర్లలో కూడా ఉపయోగిస్తారు.
ఈ చికిత్స ప్రయోజనాలు?
- చర్మ గాయాలను నయం చేస్తుంది.
- స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది.
- వృద్ధాప్య మచ్చలు, ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.
- ముఖ ఆకృతిని మృదువుగా చేస్తుంది.
- తామర, రోసేసియా, సోరియాసిస్ చికిత్స చేయవచ్చు.
- గాయం గుర్తులను తగ్గిస్తుంది.
- ఎండలో దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.
- మొటిమలకు చికిత్స చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.