Immunity : వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీ మరింత పెరగాలంటే ఈ పండు ఒక్కటి చాలు !

Immunity : టమాటాలను రకరకాలుగా వాడుతూ మన ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. కూరల్లో, సలాడ్లలో, టమాటా సూప్ రూపంలో, టమాటా జ్యూస్‌గా తీసుకోవచ్చు. టమాటా ప్యూరీని సాస్‌లు మరియు కర్రీల బేస్‌గా కూడా ఉపయోగించవచ్చు

Published By: HashtagU Telugu Desk
Tamato

Tamato

వర్షాకాలంలో అనేక రకాల సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) అధికంగా వస్తుంటాయి. ఈ సమయంలో శరీర రోగనిరోధక వ్యవస్థ (Immunity ) బలహీనమవుతుంది. అటువంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడే ముఖ్యమైన ఆహార పదార్థాల్లో టమాటాలు (Tomato) ఒకటి. టమాటాలలో విటమిన్ A, C, K లతో పాటు యాంటీఆక్సిడెంట్లు, లైకోపీన్ వంటి శక్తివంతమైన పోషకాలుంటాయి. వీటివల్ల మన శరీరం వ్యాధులను దీటుగా ఎదుర్కొనగలగుతుంది. ముఖ్యంగా విటమిన్ C వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

KTR : కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు – గజ్జెల కాంతం

టమాటాలు తక్కువ కేలరీలతో ఉండి ఎక్కువ పోషక విలువను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ K ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. అలాగే పొటాషియం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. టమాటాలలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడం ద్వారా కణ నష్టాన్ని తగ్గిస్తాయి. వర్షాకాలంలో శరీరం వైరస్‌లు, బాక్టీరియాల ప్రభావానికి గురవుతుంటే, టమాటాల్లోని పోషకాలు సహజ రక్షణగా పనిచేస్తాయి.

Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!

టమాటాలను రకరకాలుగా వాడుతూ మన ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. కూరల్లో, సలాడ్లలో, టమాటా సూప్ రూపంలో, టమాటా జ్యూస్‌గా తీసుకోవచ్చు. టమాటా ప్యూరీని సాస్‌లు మరియు కర్రీల బేస్‌గా కూడా ఉపయోగించవచ్చు. టమాటా జ్యూస్‌కు తులసి లేదా పుదీనా కలిపితే మరింత రుచి, ఆరోగ్యం పెరుగుతుంది. వర్షాకాలంలో టమాటాలను ప్రతిరోజూ ఆహారంలో చేర్చడం ద్వారా మనం సాధారణ జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. అందువల్ల టమాటాలను మర్చిపోకుండా ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.

  Last Updated: 20 Jun 2025, 09:26 AM IST