Phone Anxiety: నేటి కాలంలో కొంతమంది ఆహారం లేకుండా రోజంతా జీవించగలరు. కానీ ఫోన్ లేకుండా జీవించడం కష్టంగా మారుతోంది. కొంతమంది ఫోన్‌కి ఎంతగా అడిక్ట్ అయిపోయారంటే గంటల తరబడి ఫోన్‌తో వాష్‌రూమ్‌లో కూర్చుంటారు. ఈరోజు ఫోన్ అనేది ఒక అవసరంగా మారింది. మీరు మీ ఫోన్ ద్వారా పెద్ద పనులను సులభంగా చేయవచ్చు. అయితే ఈ రోజుల్లో కూడా కొంతమంది ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆందోళన (Phone Anxiety) చెందుతారు. వారు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురవుతారు. ఎవరి కాల్‌నైనా తీయడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే.. అది ఆందోళన కలిగించే విషయం. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం.
ఫోన్ కాల్ ఆందోళన అంటే ఏమిటి?
ఫోన్ కాల్ ఆందోళన అనేది ఒక రకమైన టెన్షన్, స్ట్రెస్‌గా పరిగణించబడుతుంది. ఈ వ్యాధిలో వ్యక్తికి ఫోన్‌లో మాట్లాడాలని అనిపించదు. అంతేకాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఫోన్‌కు సమాధానం ఇవ్వాలా..? వద్దా అని ఆలోచిస్తారు. ఇది ఒక తీవ్రమైన వ్యాధి. దీనిలో ఒకరికి కాల్ వచ్చినప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు భయం భయంగా ఉంటారు. ఫోన్ కాల్ ఆందోళనను టెలిఫోబియా, టెలిఫోనోఫోబియా అని కూడా అంటారు.
Also Read: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఐదు కొత్త బైక్‌లు.. ఫీచర్లు ఇవే..!
ఫోన్ కాల్ ఆందోళన ప్రారంభ లక్షణాలు
- ఫోన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు గుండె దడ
- ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఛాతీలో మార్పులు
- కాల్ మాట్లాడేటప్పుడు విపరీతమైన చెమట
- ఫోన్ తీసేటప్పుడు చేతులు వణకటం
- మాట్లాడుతున్నప్పుడు కంఠస్వరంలో తేడా
- మాట్లాడేటప్పుడు సంకోచం
- ఫోన్ తీయాలని అనిపించకపోవడం
- మాట్లాడేటప్పుడు భయం అనిపించడం
- ఫోన్‌కి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండకపోవటం
We’re now on WhatsApp : Click to Join
ఫోన్ కాల్ ఆందోళనను నివారించడానికి మార్గాలు
వ్యాయామం చేయండి
ఫోన్ కాల్ ఆందోళన నుండి బయటపడటానికి సులభమైన మార్గం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. వ్యాయామంతో పాటు ధ్యానం చేయండి.
CBT థెరపీ
ఫోన్ కాల్ ఆందోళనను నివారించడానికి మీరు CBT థెరపీని తీసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ థెరపిస్ట్ సహాయంతో మాత్రమే దీన్ని చేయండి.
ప్రజలతో మాట్లాడాలి
సాధారణంగా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఫోన్ కాల్ ఆందోళనను వదిలించుకోవాలనుకుంటే వీలైనంత ఎక్కువ సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి. ప్రజలను కలవడం, మాట్లాడటం వలన మీ భయాన్ని తొలగించవచ్చు