Summer Tips: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 04:33 PM IST

వేసవికాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఈ ఎండ వేడి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం అయింది అంటే చాలు రోడ్డు మొత్తం ఖాళీ గానే ఉంటున్నాయి. వాహనదారులు రోడ్లోకి రావాలి అంటేనే భయపడుతున్నారు. అందుకే ఎండాకాలంలో ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. మామూలు మనిషులు మాత్రమే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మరి వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు అప్పుడే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డిహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబోయే తల్లులు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఈ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటూ , పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై కూడా శ్రద్ధ వహించాలి.

Also Read: Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

ప్రినేటల్ కేర్‌లో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. పిండం ఎదుగుదలకు, కణజాలాల పెరుగుదలకు, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి యాంటీబాడీస్‌ ఉత్పత్తి చేయడానికి.. ప్రొటీన్‌ చాలా అవసరం. ప్రొటీన్‌ కడుపులోని బిడ్డ అస్థిపంజరం, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది. గుడ్డులో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. కోలిన్, లుటిన్, విటమిన్‌ బి12, డి , రిబోఫ్లావిన్, ఫోలేట్ వంటి పోషకాలూ గుడ్డులో మెండుగా ఉంటాయి. ఇవి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడతాయి. తాజా ఆకుకూరల్లో విటమిన్‌ సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

Also Read: Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?

ఈ ఫైబర్‌ మలబద్ధక సమస్యకు చెక్‌ పెడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు తమ డైట్ లో సలాడ్స్‌, కూరల్లో ఆకుకూరలు చేర్చుకోవాలి. అలాగే తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. అలాగే ఈ సమయంలో మోనోఅన్‌శాచురేటెడ్, ఈ హెల్తీ ఫ్యాట్స్‌ శిశువు మెదడు, కళ్లు, మావి ఇతర కణజాలాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నట్స్‌, విత్తనాలలో హెల్తీ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో బాదం, పిస్తా, అవిసె గింజలు, వెరుశనగలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పండ్లలో ఉండే విటమిన్‌ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే నాన్‌వెజిటేరియన్స్‌ వారి డైట్‌లో చేపలు చేర్చుకోవచ్చు. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే చాలు తప్పకుండా ఉండవచ్చు.