Site icon HashtagU Telugu

Asthma Patients : వానాకాలంలో ఆస్తమా ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

precautions should be taken by people with asthma during rainy season

precautions should be taken by people with asthma during rainy season

వానాకాలం(Rainy Season)లో వచ్చే వాతావరణ మార్పుల వలన ఆస్తమా(Asthma Patients) ఉన్న వారికి సమస్య ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఆస్తమా ఉన్నవారు వానాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వానాకాలంలో ఊపిరి సరిగా అందకపోవడం, ఉబ్బసం, జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వాతావరణం చల్లగా మారినప్పుడు ఆస్తమా ఉన్నవారు వేడి నీళ్ళల్లో(Hot Water) పసుపు వేసి రోజుకు నాలుగు సార్లు ఆవిరి పట్టుకోవాలి. అదేవిధంగా రోజుకు రెండు సార్లు పసుపు, మిరియాల పొడి కలిపి మరిగించిన పాలు తాగాలి.

జలుబు, దగ్గుతో ఎక్కువగా బాధ పడేవారు వేడినీళ్ళల్లో ఉప్పు వేసుకొని పుక్కిలించాలి. మిరియాల పాలు, తేనె, నిమ్మరసం వంటివి తాగుతుండాలి. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకున్నా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. తమలపాకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకున్నా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వారి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా నీటి శాతం తగినంత ఉండేలా చేసుకోవాలి.

ఉబ్బసం, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లను రోజూ తినాలి. విటమిన్ ఇ, బీటాకెరోటిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉండే పాలకూర, అవకాడో, బ్రోకలీ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మెగ్నీషియం, ఫ్యాటీ ఆసిడ్స్ కోసం రోజూ నట్స్ తినాలి. అదేవిధంగా ఆస్తమా కొరకు ఎవరైతే రోజూ మందులు వాడుతున్నారో వాటిని తప్పకుండా వేసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. మనం ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటివి రాకుండా ఉంటాయి.

 

Also Read : Yoga Poses For Sinus: సైనస్ తో సతమతమవుతున్నారా.. అయితే ఈ ఆసనాలు ట్రై చేయండి..!