Potato Face Pack: కూరగాయలు ఆరోగ్యానికి అలాగే చర్మానికి చాలా మేలు చేస్తాయి. అనేక వ్యాధుల నుండి రక్షించడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. బంగాళాదుంపలో ఉండే గుణాలు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.దీన్ని ఉపయోగించడం ద్వారా నల్లటి వలయాలను కూడా వదిలించుకోవచ్చు. విటమిన్-సి, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు బంగాళదుంపలో సమృద్ధిగా ఉంటాయి. ఇది మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఇంట్లోనే బంగాళదుంపలను ఉపయోగించి సులభంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం.
నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముందుగా బంగాళాదుంపను తురుముకోవాలి. దానికి ఒక టీస్పూన్ తేనె మరియు నిమ్మరసం జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. మిశ్రమాన్ని ముఖం మరియు మెడపై అప్లై చేయండి. సుమారు 15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. దీంతో మీ చర్మం తళతళ మెరుస్తుంది.
గుడ్డులో ఉండే గుణాలు హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్-ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో మరియు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ చేయడానికి బంగాళదుంపలను తురుముకోవాలి. దానికి గుడ్డులోని తెల్లసొన వేసి దానికి విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి. దాదాపు 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తరువాత రిజల్ట్ మీరే చూస్తారు.
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలు, చర్మం మరియు అనేక ఇతర సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి ఒక గిన్నెలో తురిమిన బంగాళాదుంపలను తీసుకుని, దానికి అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా బ్లెండ్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
గంధపు పొడిలో బంగాళదుంప రసాన్ని కలిపి, కావాలంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. దీంతో ముఖానికి మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా మీ చర్మం ఆరోగ్యంగాను, అందంగానూ కనిపిస్తుంది.