Raisins: ఈ సమస్యలు ఉన్న వాళ్లు ఎండు ద్రాక్ష కు దూరంగా ఉండాలి.

కిస్మిస్, మునక్కా ఎలా పిలిచినా అది ఒక ఎండిన ద్రాక్షలే.  ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. సాధారణంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు.

కిస్మిస్ (Raisins), మునక్కా ఎలా పిలిచినా అది ఒక ఎండిన ద్రాక్షలే.  ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. సాధారణంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఇది ఎంతో ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. వీటిలో కొవ్వులు ఉండవు. కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి వీటిని తినడం అన్ని విధాల ఆరోగ్యకరమని ఆంగ్ల వైద్యంతో పాటు సాంప్రదాయ వైద్యం కూడా చెబుతోంది. అందుకే వీటికి అభిమానులు ఎక్కువ. పోషకాహార నిపుణులు రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినమని సూచిస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

ఎవరు తినకూడదు?

కొందరు తమకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలచబరిచే మందులను వాడుతూ ఉంటారు. ఇలాంటి వారు కిస్మిస్‌ లను తినక పోవడమే ఎంతో మేలు. ఎందుకంటే ఆ మందులతో ఈ కిస్మిస్‌ లు ప్రతికూల పరస్పర చర్యను జరిపే అవకాశం ఉంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు కూడా కిస్మిస్‌ లను దూరం పెడితే మంచిది. తినేముందు ఓసారి వైద్యున్ని సంప్రదించడం అన్ని విధాలా ఉత్తమం. కిస్మిస్లు ఆరోగ్యానికి మంచివని, అధికంగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. ఇవి అరగడానికి సమయం పడుతుంది. అందుకే జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు, బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉన్నవారు కిస్మిస్‌ లను తక్కువగా తినాలి.

కిస్‌మిస్ (Raisins) వల్ల జరిగే అనర్ధాలు తక్కువే కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

  1. వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. అందుకే అధిక బరువును తగ్గాలనుకునేవారు, రోజు గుప్పెడు కిస్మిస్‌ లను తినడం మంచిది. అలాగే ఈ వీటిలో లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కొవ్వును కాల్చేస్తుంది.
  2. కిస్‌మిస్‌ లో రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోని కణాలలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఆ మార్గాన్ని క్లియర్ చేస్తుంది. ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
  3. రాత్రంతా నానబెట్టిన కిస్‌మిస్‌ లను ఉదయం లేచి తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషాన్ని నివారించే శక్తి దీనిలో ఉంది. పొట్టలో శీతలీ కరణ ప్రభావాన్ని చూపిస్తుంది.
  4. వీటిని తినడం వల్ల దంతాలకు ఎంతో మంచిది. చిగుళ్ల వాపు వంటి సమస్యలను నయం చేస్తుంది. రోజు అయిదారు కిస్మిస్‌ లను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంత బాక్టీరియాని చంపి దంతక్షయం బారిన పడకుండా కాపాడుతుంది.
  5. పిల్లలు, మహిళల్లో అధికంగా రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటివారు రోజూ గుప్పెడు కిస్‌మిస్ తింటే చాలా మంచిది. ఐరన్, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతకు సరైన చికిత్సను చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
  6. మగవారిలో సంతాన ఉత్పత్తిని పెంచే శక్తి కిస్మిస్‌ లకు ఉంది. ఇది కామ ఉద్దీపనకు సహకరిస్తుంది. స్పెర్మ్  కౌంట్ పెంచి సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలలో కిస్మిస్లు నానబెట్టి తాగితే ఎంతో మంచిది. అంగస్తంభన సమస్యకు ఇది సరైన చికిత్స.

Also Read:  Shiva Kanchi: శివ కంచి లోని ఈ మామిడి చెట్టు విశిష్టత మీకు తెలుసా?