అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అత్తి పండులో ఉన్నాయి. సహజ చక్కెరతో కూడిన జ్యూసీ డ్రై ఫ్రూట్ అంజీర్. అనేక కడుపు సంబంధిత సమస్యల్ని తొలగించడంలో సహాయపడుతుందట. అలాగే అంజీర్ రోజు తీసుకోవడం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో కూడా ఈ పండు చాలా సహాయపడుతుందట.
అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంజీర్ పండుని కొంతమంది తీసుకోకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు అంజీర్ పండును తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుందట. నానబెట్టిన అంజీర్ రోజూ తినడం వల్ల అనేక మంచి ప్రయోజనాలు ఉంటాయట. అంజీర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని రక్షిస్తాయట. అత్తి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ లభిస్తుందట. కాగా అంజీర్ పండ్లను తినడం వల్ల కొంతమందిలో చర్మ అలెర్జీలు వస్తాయి. అందుకే చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అంజీర్ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొన్ని సార్లు ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యల్ని కలిగిస్తుందట.
కాబట్టి ఇప్పటికే గ్యాస్ సమస్య, ఉబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు అత్తిపండ్లు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. లేదంటే అపానవాయువు, వాపు సంభవించవచ్చట. అంతేకాకుండా మలబద్ధక సమస్య మరింత తీవ్రం కావచ్చని చెబుతున్నారు. ఈ అంజీర్ పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు అత్తి పండ్ల వంటి తీపి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు. మీకు అత్తి పండ్లను తినాలని అనిపిస్తే, తక్కువ మోతాదులో తినాలని చెబుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా అత్తి పండ్లను తినకూడదట. ఒకవేళ తింటే అవి కాలేయ పనితీరును నెమ్మదిస్తాయట.
బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో అంజీర్ పండ్లను చేర్చుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. వీరు అత్తి పండ్లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిని చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీరు బరువు తగ్గకపోగా, బరువు పెరిగే ప్రమాదముందట. అలాగే అంజీర్ పండ్లను ఎక్కువ మోతాదులో తినకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో తింటే రక్త స్రావం సమస్యలు తలెత్తే ప్రమాదముందట. అత్తి పండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ వస్తుందట. దీంతో కడుపు ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదముందట. మహిళలు పీరియడ్స్ సమయంలో అత్తి పండ్లను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.