Skin Cancer Treatment : క్యాన్సర్.. ఇదొక ప్రాణాంతకమైన వ్యాధి. క్యాన్సర్ వచ్చిన వారు ఎక్కువకాలం బ్రతకరన్నది వాస్తవమే. కానీ.. ఇప్పుడొచ్చిన వైద్యంతో క్యాన్సర్ ను కూడా జయిస్తున్నవారున్నారు. అది కేవలం సంపన్నుల వరకే పరిమితం. డబ్బున్నవారే క్యాన్సర్ ను జయిస్తున్నారు. బసవతారకం వంటి ఆసుపత్రుల చొరవతో.. మరికొందరు క్యాన్సర్ నుంచి బయటపడుతున్నారు. క్యాన్సర్ లో చాలారకాలున్నాయి. అలాంటివాటిలో స్కిన్ క్యాన్సర్ ఒకటి. భయానకమైన ఈ వ్యాధిని తక్కువ ఖర్చుతోనే నయం చేసేలా.. 14 ఏళ్ల 9వ తరగతి విద్యార్థి ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు. ఈ ఒక్క ఆవిష్కరణతోనే అతను యువ శాస్త్రవేత్తగా పేరొందాడు.
వివరాల్లోకి వెళ్లే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే స్కిన్ క్యాన్సర్ ను అతి తక్కువ ఖర్చుతో జయించేలా ఒక సబ్బుని తయారు చేశారు. ఈ సబ్బు ధర కేవలం 10 డాలర్లు. మన కరెన్సీలో 800 రూపాయలు మాతరమే. ఈ సబ్బు తయారు చేయడంతో హేమన్ టాప్ యంగ్ సైంటిస్ట్ అవార్డుతో పాటు 25 వేల డాలర్ల (31 లక్షలు) ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు.
ఫెయిర్ ఫాక్స్ కౌంటీలోని ఫ్రాక్స్ మిడిల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న హేమన్ .. ఈ సబ్బును కనుగొనేందుకు త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్ మహ్పుజా అలీ సహాయం చేశారు. సుమారు 10 మంది పాల్గొన్న ఈ పోటీలో హేమన్ అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా గెలిచాడు. ఇథియోపియాకు చెందిన హేమన్.. తాను ఆ ప్రాంతంలో ఉన్నపుడు చాలామంది స్కిన్ క్యాన్సర్ తో బాధపడుతుండటం చూశానని.. అప్పుడే దానిని సులభంగా తగ్గించేలా ఏదైనా కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. అందుకు ఈ ఛాలెంజ్ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పాడు.
ఈ స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్.. చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరించి.. స్కిన్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని బెకెలే తెలిపాడు. ఇప్పటివరకూ మార్కెట్ లో స్కిన్ క్యాన్సర్ ను తగ్గించే క్రీమ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, తొలిసారి స్కిన్ క్యాన్సర్ తో పోరాడే సబ్బును ఆవిష్కరించినట్లు యంగ్ ఛాలెంజ్ ప్రజెంటేషన్ ప్యానల్ కు వివరించాడు. ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి కొత్త ప్రేరణ ఇస్తుందనుకుంటున్నట్లు హేమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Also Read : Arthritis Pain: కీళ్ల నొప్పులు భరించలేనంతగా ఉంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!