Fatty Liver: ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty Liver Disease) నిశ్శబ్దంగా శరీరాన్ని దెబ్బతీసే ‘నిశ్శబ్ద హంతకి’ (Silent Killer) లాంటిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. అయితే సరైన ఆహార నియమాలతో ఈ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే కొన్ని వంటింటి చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్‌ను తగ్గించే ఆహారాలు
వైద్యుల సూచనల ప్రకారం ఈ ఆహారాలు ప్రతిరోజూ తీసుకోవడం లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బ్లాక్ కాఫీ: బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్స్ లివర్‌లోని కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఈ యాంటీ-ఆక్సిడెంట్ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.
పెసల పప్పు: ఇందులో తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్, రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది. తద్వారా లివర్‌కు మేలు చేస్తుంది.
వాల్‌నట్స్ (అక్రోట్): ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఉసిరికాయ (ఆమ్లా): విటమిన్ సి, యాంటీ-ఆక్సిడెంట్లతో నిండిన ఉసిరికాయ లివర్‌ను డిటాక్స్ చేసి, దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
Also Read: Shubman Gill: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గిల్ సంచలన వ్యాఖ్యలు!
ఫ్యాటీ లివర్ లక్షణాలు ఇవే
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలను కూడా వైద్యులు తెలిపారు.
- ఎప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపించడం.
- పొట్ట కుడి వైపు పై భాగంలో తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించడం.
- ఆకలి తగ్గడం లేదా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం.
- వికారం లేదా వాంతులు వచ్చినట్లు అనిపించడం.
- ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం.
సమస్య తీవ్రంగా ఉంటే కనిపించే లక్షణాలు
- పచ్చకామెర్లు (పీలియా): కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం.
- పొట్ట ఉబ్బరం లేదా పొట్టలో నీరు చేరడం (అసైటిస్).
- కాళ్లు, చీలమండలలో వాపు.
- శరీరంపై నిరంతర దురద.
- ఏకాగ్రత (దృష్టి) పెట్టడంలో ఇబ్బంది.
- చర్మంపై ఎర్రటి సాలీడు లాంటి గుర్తులు (స్పైడర్ యాంజియోమాస్) కనిపించడం.