Nails: మీరు మీ గోర్లను (Nails) జాగ్రత్తగా గమనిస్తే వాటిపై అర్ధచంద్రాకారం లాంటి ఆకారం కనిపిస్తుంది. దీనిని లునులా (అర్ధచంద్రాకారం) అంటారు. ఇది సాధారణంగా అందరి గోర్లపై కనిపిస్తుంది. అయితే దీని ఆకారం, రంగు మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలను తెలియజేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత తెలుసుకుందాం.
రంగు ఆరోగ్య స్థితిని సూచిస్తుంది
కొందరిలో లునులా రంగు కింది సమస్యలతో సంబంధం కలిగి ఉండవచ్చు.
- ఎరుపు రంగు: సిరోసిస్, ఊపిరితిత్తుల వ్యాధి లేదా గుండె వైఫల్యం
- నీలం రంగు: విల్సన్స్ డిసీజ్, డయాబెటిస్
- గోధుమ రంగు: దీర్ఘకాల కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ వైఫల్యం
- తెలుపు రంగు: కిడ్నీ సంబంధిత వ్యాధులు లేదా టెర్రీస్ నెయిల్స్
- పసుపు రంగు: యెల్లో నెయిల్ సిండ్రోమ్, టెట్రాసైక్లిన్ థెరపీ
ఆకారంలో మార్పులు
మీరు రక్తహీనత లేదా పోషకాహార లోపంతో బాధపడుతుంటే గోర్లపై ఈ అర్ధచంద్రాకారం కుంచించుకుపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతర లక్షణాలు కనిపించకపోతే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వయస్సు పెరిగే కొద్దీ లునులా ఆకారం మారడం లేదా కొందరిలో పూర్తిగా అదృశ్యం కావడం జరుగుతుంది.
Also Read: Finn Allen: టీ20ల్లో సరికొత్త రికార్డు.. 19 సిక్సులతో విధ్వంసం, ఎవరీ ఐపీఎల్ అన్‌సోల్డ్ ఆటగాడు!
లునులాను తిరిగి తీసుకురాగలమా?
ఒకవేళ లునులా ఏదైనా వ్యాధి కారణంగా అదృశ్యమైతే ఆ వ్యాధి నయమైన తర్వాత అది తిరిగి కనిపించే అవకాశం ఉంది. పోషకాహార లోపం వల్ల ఇలా జరిగితే మీరు మీ ఆహారం నుంచి ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్‌లను తొలగించి, సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారంలో pH సమతుల్యం 7 కంటే ఎక్కువగా అంటే ఆల్కలీన్‌గా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఈ సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించండి
లునులాలో జరిగే మార్పులు ఎల్లప్పుడూ తప్పును సూచించవు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి మీకు డాక్టర్‌ను సంప్రదించాలని సూచనగా ఉంటాయి. ఈ కింది మార్పులు కనిపిస్తే తప్పకుండా వైద్య సలహా తీసుకోండి.
- ఆకస్మికంగా బరువులో మార్పు
- కారణం లేకుండా అలసట
- చర్మ రంగులో మార్పు
- జుట్టు రాలిపోవడం