Munagaku : మునగాకు తినండి.. ఎన్ని ప్రయోజనాలా తెలుసా??

మునగకాడలతో పాటు.. మునగ ఆకులతో(Munagaku) కూడా కూర, పప్పు, పొడి చేసుకుని తింటారు. చాలామంది దీనిని ఇష్టపడరు కానీ ఒక్కసారి తింటే వదలరు.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 11:10 PM IST

మనం రోజువారీ తినే కూరగాయల్లో మునగకాడలు(Drum Sticks) కూడా ఒకరకం. అయితే ఇప్పుడు ఇవి ఏడాదంతా వచ్చినా.. సీజనల్ గా వచ్చే కాయలకే రుచి ఎక్కువ. మునగకాడలతో పాటు.. మునగ ఆకులతో(Munagaku) కూడా కూర, పప్పు, పొడి చేసుకుని తింటారు. చాలామంది దీనిని ఇష్టపడరు కానీ ఒక్కసారి తింటే వదలరు. మునగ ఆకుల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య(Health) ప్రయోజనాలున్నాయి.

#గాయాలు తగిలిన ప్రదేశంలో.. మునగాకు, వసకొమ్ము, వాములను సమంగా దంచి నూనెలో ఉడకబెట్టి కడితే అవి త్వరగా తగ్గుతాయి.
#మునగాకు రసం తాగడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
#లేత మునగాకును కూరగా వండుకుని తింటే పురుషులకు లైంగిక శక్తి పెరుగుతుంది.
#అలాగే మునగాకు వంటలు తినడం వల్ల మలబద్ధకం పోయి సుఖ విరేచనం కూడా అవుతుంది.
#స్త్రీలు మునగాకును కూరగా లేదా పప్పుతో కలిపి వండుకుని తింటే.. స్త్రీల శరీరంలో ఉండే చెడు నీరు తొలగిపోతుంది.
#తరచుగా మునగాకు రసం తాగితే.. కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే వాత, పైత్య దోషాలు, విషాలు హరింపబడతాయి.
#కొన్ని పరిశోధనల్లో మునగాకులో ఉండే పదార్థాలు పాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేశాయని తేలింది.
#మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో ఒత్తిడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
#వీటిలో ఉండే ఇన్సులిన్ వంటి ప్రొటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.
#కణాలు దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు మునగాకులో పుష్కలంగా ఉంటాయి. మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారా.. ఇంకెందుకు ఆలస్యం మునగాకు కూర తినడం, మునగాకు రసం తాగడం మీరూ అలవాటు చేసుకోండి.

 

Also Read :  Muskmelon: వేసవిలో కర్బూజా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?