Site icon HashtagU Telugu

Silence : మౌనంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు.. అందుకే ఒక్కరోజైనా మౌనవ్రతం..

Mouna Vratham Silence is very useful for Mental Health

Mouna Vratham Silence is very useful for Mental Health

మౌనంగా(Silence) ఉండడం వలన మన మెదడు(Mind) ప్రశాంతంగా తయారవుతుంది. నిశ్శబ్దంగా ఉండడం వలన మన శ్వాస కదలికలను అనుభవించడం, వాటిని గమనించడం వలన మనకు ఆనందం కలుగుతుంది. మౌనంగా ఉండడం వలన మన మనస్సు శక్తి పెరుగుతుంది. ఎక్కువ శక్తి గల మనస్సు భయం, కోపం, ఆందోళన లాంటివి ఉండవు. మౌనంగా ఉండడం వలన మానసిక రుగ్మతలు తగ్గుతాయి.

మనం మాటకు మాట బదులు ఇవ్వడం వలన సమాచార మార్పిడి జరుగుతుంది. మనం మన మనస్సులో ఏది జరుగుతుందో దానిని బయటకు మాటల రూపంలో వ్యక్తపరుస్తాము. అయితే మనం మౌనంగా ఉండడం వలన ప్రతీది నిశ్శబ్దంగా ఉంటుంది. దీని వలన మన మనస్సు సంతృప్తి చెందుతుంది. మౌనంగా ఉన్నప్పుడు మనం ఏదయినా మాట్లాడాలి అనుకుంటే సంకేతాల ద్వారా తెలియజేస్తాము. లేదా రాత పూర్వకంగా తెలియజేస్తాము. కాబట్టి మనం మన ముఖ్యమైన ఆలోచనలను మాత్రమే తెలియజేస్తాము.

ఈ విధంగా మనం అవసరమైన భావాలను మాత్రమే వ్యక్తపరుస్తాము. మనం మౌనంగా ఉండడం వలన మనకు ఏకాగ్రత పెరుగుతుంది. మనం వేరే వారితో మాట్లాడినప్పుడు మనం ఉన్నచోట జరిగే విషయాలను గమనించలేము. కానీ మౌనంగా ఉండడం వలన మనం అన్ని విషయాలను గమనిస్తుంటాము. మౌనంగా ఉండడం వలన మన ఆలోచనలను మెరుగుపరుచుకోవచ్చు. మనం మౌనంగా ఉన్నప్పుడు మనకు గాలి, వేడి, వర్షం వంటివి కూడా శబ్దాలుగా వినిపిస్తాయి. ఈ విధంగా మనం ప్రకృతికి దగ్గరగా ఉండవచ్చు మన మనస్సుకు ఓదార్పు కలుగుతుంది. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది.

అందుకే కనీసం రెండు వారాలకి ఒకసారి అయినా ఒక రోజంతా మౌనంగా ఉండాలి. అంటే మన పెద్దలు చెప్పినట్టు మౌనవ్రతం(Mouna Vratham) చేయాలి. మౌనవ్రతం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టే మన పెద్దలు చెప్పారు. అలాగే మౌనవ్రతంలో ధ్యానం చేసుకుంటే మనసుతో పాటు శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. మౌనంగా ఉండటం వల్ల ఇన్ని ప్రయోజనా

 

Also Read : Garlic: వెల్లుల్లితో ఇలా చేస్తే చాలు సంపద పెరగడం ఖాయం?