Health Tips: రాత్రిపూట ఇలా భోజనం చేస్తే చాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో ఒక సమయం పాడు అంటూ లేకుండా పోయింది. ఉదయాన్నే తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం ఎప్పుడో తినడం

Published By: HashtagU Telugu Desk
Mixcollage 28 Jan 2024 04 56 Pm 2585

Mixcollage 28 Jan 2024 04 56 Pm 2585

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో ఒక సమయం పాడు అంటూ లేకుండా పోయింది. ఉదయాన్నే తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం ఎప్పుడో తినడం, మధ్యాహ్నం తినాల్సిన లంచ్ సాయంత్రం తినడం, సాయంత్రం తినాల్సిన డిన్నర్ ని అర్ధరాత్రి ఎప్పుడో తింటూ ఉంటారు. ఈ మధ్య రాత్రి 10,11 గంటలకు తినడం బాగా అలవాటు అయిపోయింది. అయితే ఇలా ఒక పద్ధతంటూ లేకుండా ఎప్పుడు ఆకలైతే అప్పుడు తింటే కుదరదు. ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వస్తుంది. ఒంట్లో చక్కెర స్థాయి పెరుగుతుంది. జీర్ణక్రియ క్రమం తప్పుతుంది. తిన్నది అరగక కడుపుబ్బరంతో బాధపడాల్సి ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. పొద్దున్నే విసర్జన సాఫీగా జరగదు.

తిన్నది ఒంట బట్టక రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి రాత్రి పూట ఎప్పుడు ఎలా ఎంత తినాలో తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. రాత్రిపూట ఎప్పుడు తిన్నా కూడా మనం పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు అయినా తినడం మంచిది. రోజూ ఒకే సమయానికి, సరిపోను భోజనం చేయాలి. ఎక్కువ, తక్కువ తినొద్దు. ఇలా చేస్తే పడుకోవటానికి ముందే తిన్నదాంట్లో సగం వరకు అరుగుతుంది. మిగతాది నిద్రపోయాక జీర్ణమవుతుంది. పడుకున్న తర్వాత జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది కాబట్టి తిన్నది మొత్తం నిద్రలోనే అరగటం జరగని పని. ఫలితంగా అజీర్తితో బాధపడాల్సి ఉంటుంది.

అలాగే బాడీలో షుగర్ లెవల్స్ పెరిగితే బయటి నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసం హాస్పిటల్ లో చేరి కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలి. దానివల్ల డబ్బు ఖర్చవుతుంది. టైమ్ వేస్ట్ అవుతుంది. ఇన్సులిన్ మన శరీరంలోనే సహజంగా ఉత్పత్తి కావాలంటే రాత్రి పూట త్వరగా తినాలి. తద్వారా నిద్ర కూడా బాగా పడుతుంది. ఆలస్యంగా భోజనం చేస్తే అది అరగకుండా పొట్టలో అలాగే ఉండిపోతుంది. దీంతో కడుపు నొప్పిగా అనిపించొచ్చు. ఎసిడిటీ రావచ్చు. రాత్రి పూట త్వరగా తినటం వల్ల ఒంట్లో వేడి సైతం తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ పెరిగితే ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏ సమయంలో రాత్రిపూట భోజనం చేస్తే మంచిది అంటే.. రాత్రి 7:30 ప్రాంతం నుంచి ఎనిమిది లోపు తినేసి పదింటి లోపు పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది..

  Last Updated: 28 Jan 2024, 04:58 PM IST