Site icon HashtagU Telugu

Processed Foods : ఆధునిక ఆహారపు అలవాట్లు..పురుషుల ఆరోగ్యానికి ముప్పు!

Modern eating habits...a threat to men's health!

Modern eating habits...a threat to men's health!

Processed Foods : ఇప్పటి జీవనశైలిలో వేగంగా తయారయ్యే, ప్యాక్‌ల్లో దొరికే ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు మన రోజువారీ భోజనాల్లో భాగమయ్యాయి. అయితే, ఇవి ఆరోగ్యానికి ఎంతగానో హానికరమని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రఖ్యాత శాస్త్రీయ జర్నల్ ‘సెల్ మెటబాలిజం’లో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తక్కువ మోతాదులోనే తీసుకున్నా పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వెల్లడించింది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో 20 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న ఆరోగ్యవంతమైన 43 మంది పురుషులను ఎంపిక చేశారు. వీరికి మూడు వారాల పాటు ప్రాసెస్డ్ డైట్, మరో మూడు వారాల పాటు ప్రాకృతిక (అన్‌ప్రాసెస్డ్) డైట్‌ను అందించి, వారి శరీరంలో జరిగే మార్పులను పరిశీలించారు.

Read Also: Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఈ పరిశోధన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రాసెస్డ్ ఆహారం తినే వారిలో, అదే క్యాలరీలు తీసుకుంటున్నప్పటికీ, సగటున ఒక కిలో వరకు అదనంగా కొవ్వు పెరిగిందని గుర్తించారు. ఇది హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపడమే కాకుండా, పురుషుల్లో ప్రతిస్పందనా సామర్థ్యం (ఫెర్టిలిటీ) తగ్గేలా చేస్తోందని స్పష్టమైంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాల వల్ల శరీరంలో హానికరమైన థాలేట్‌(Phthalate) స్థాయిలు పెరిగిపోతున్నాయని పరిశోధకులు చెప్పారు. ఈ థాలేట్ పదార్థం ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యమైన హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్పెర్మ్ ఉత్పత్తికి కీలకమైన టెస్టోస్టెరాన్, ఫాలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ల స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రధాన శాస్త్రవేత్త జెస్సికా ప్రెస్టన్ మాట్లాడుతూ..ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే మోతాదుతో సంబంధం లేకుండా, వాటి తయారీ విధానం వల్లనే అవి ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యంగా కనిపించే యువకుల ఆరోగ్యంలో కూడా స్పష్టమైన మార్పులు కనిపించడం గమనార్హం.అని వ్యాఖ్యానించారు. అంతేగాక, దీర్ఘకాలిక ప్రభావాల గురించి హెచ్చరిస్తూ, ప్రొఫెసర్ రొమైన్ బ్యారెస్ చెప్పారు. ఇది కేవలం తాత్కాలిక బరువు పెరగడం మాత్రమే కాదు. దీర్ఘకాలికంగా హార్మోన్ల అసమతుల్యత, ఫెర్టిలిటీ సమస్యలు వంటి సమస్యలకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహార మార్గదర్శకాలను తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు. ఈ అధ్యయనం ఆధునిక ఆహారపు అలవాట్లను మళ్లీ పునరాలోచించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. వేగవంతమైన జీవితంలో సౌకర్యాన్ని చూసి తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ మన ఆరోగ్యానికి నెమ్మదిగా హానికరం అవుతుండటాన్ని నిర్లక్ష్యం చేయలేం. ప్రత్యేకంగా పురుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండటంతో, ఇప్పటినుంచే మన భోజనపు అలవాట్లను సమీక్షించుకోవాలి. సహజ, తాజా పదార్థాలతో తయారైన ఆహారాన్ని ప్రోత్సహించాలి.

Read Also: Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు