Ancient Recipes: ఆదివాసీ తెగల 5 పురాతన వంటకాలను ఇంట్లో తయారు చేసుకోండి

చాలా పురాతన తెగలకు భారత దేశం నిలయం.  సాధారణంగా ఆదివాసీ తెగలకు వారి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి.

చాలా పురాతన తెగలకు భారత దేశం నిలయం.  సాధారణంగా ఆదివాసీ తెగలకు వారి ప్రత్యేక వంటకాలు (Ancient Recipes) ఉన్నాయి. వీటిని స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి మట్టి చిప్పలు మరియు కుండలలో తయారు చేస్తారు. గిరిజన వంటకాలలో (Ancient Recipes) పోషక విలువలు అధికంగా ఉంటాయి. మీరు ఇంట్లో ప్రయత్నించగల ఐదు గిరిజన వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కూవలెపుట్టు

“కూవలె పుట్టు”.. కర్నాటకలోని  కూర్గ్ ఏరియాలో ఈ గిరిజన వంటకం ఫేమస్. ఆవిరితో ఉడికించిన జాక్‌ఫ్రూట్ కేక్ ఇది. . ఈ ఆవిరి వంటకం చాలా పోషకమైనది. విరిగిన బియ్యం రవ్వను కడగాలి. అందులో పంచదార, యాలకులపొడి, నెయ్యి, కొబ్బరి తురుము,  బెల్లం గుజ్జు వేసి బాగా కలపాలి. ఇది 15-20 నిమిషాలు సెట్ చేయనివ్వండి. ఈ మిశ్రమాన్ని అరటి ఆకులపై వేసి, మడిచి భద్రపరచండి. 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి సర్వ్ చేయాలి.

అంగాకర్ రోటీ

అంగాకర్ అనేది ఛత్తీస్‌ గఢ్‌లోని ఒక బియ్యం ఆధారిత సాంప్రదాయ వంటకం. దీనిని ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో అల్పాహారంలా తింటారు.  బియ్యప్పిండి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.  నువ్వులు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసి మెత్తని పిండిలా చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.  పిండిని రోల్ చేసి తవాలో ఉడికించాలి.

మాడుగుల హల్వా

మాడుగుల హల్వా అనేది నెయ్యితో కూడిన డెజర్ట్. దీనిని గోధుమ పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు. ఈ వంటకం ఆంధ్ర ప్రదేశ్‌లోని  మాడుగుల ఏరియా ఆదివాసీ తెగలు తయారు చేస్తుంటాయి.  నెయ్యి రాసిన బాణలిలో పిండిని వేయించాలి. ప్రత్యేక గిన్నెలో చక్కెర మరియు నీటిని కలిపి వేడి చేసి, పిండిలో కలపండి. ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదం, పంచదార పాకం వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి సర్వ్ చేయాలి.

మాండియా జౌ

రాగి గంజి లేదా మాండియా జౌ ఒక ఆరోగ్యకరమైన ఒడియా గిరిజన వంటకం. రాగులతో చేసిన ఈ వంటకాన్ని నవజాత శిశువులకు కూడా తినిపించవచ్చు. ఉడికించిన అన్నంతో పాటు పాన్‌లో నీరు వేసి 15 నిమిషాలు ఉడికించాలి.  బియ్యం మిశ్రమంలో నానబెట్టిన రాగులు మరియు నీరు వేసి 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు మరియు నెయ్యి వేసి బాగా కలపండి మరియు సర్వ్ చేయండి.

గుర్-గుర్ చ

కార్గిల్, లేహ్ జిల్లాలలోని హను, దార్చిక్, బీమా, ధా, గార్కోనే గ్రామాలలో స్థానిక తెగలలో గుర్-గుర్ చ వంటకం ఫేమస్.ఇది పింక్ కలర్ టీ. జలుబు మరియు దగ్గు నుండి కాపాడుతుందని నమ్ముతారు. టీ ఆకులను వేడి నీటిలో ఉడకబెట్టండి. దీనికి బేకింగ్ సోడా మరియు వెన్న జోడించండి. కొంత సేపు అలాగే ఉండనివ్వండి. వడకట్టి వేడిగా సర్వ్ చేయండి.

Also Read:  Isabgol Benefits: ఈసబ్ గోల్ తో చెడు కొలెస్ట్రాల్ ఖతం