Fetus In Fetu : గర్భిణిగా ఉన్న మహిళ కడుపులో శిశువు ఉంటుంది. ఇది సర్వ సాధారణ విషయమే. అయితే గర్భిణిగా ఉన్న ఒక మహిళ కడుపులో మోస్తున్న శిశువు కడుపులోనూ పసిగుడ్డు ఉందని మహారాష్ట్ర డాక్టర్లు గుర్తించారు. ఈ అరుదైన మెడికల్ కేసుతో ముడిపడిన వివరాలివీ..
Also Read :311 Traffic Violations: ఒక్క వ్యక్తి.. 311 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.61 లక్షల ఫైన్ వసూల్
ఆ పసికందుకు ఏం చికిత్స చేస్తారు ?
పైన మనం చెప్పుకున్న వెరైటీ కండీషన్‌ను కలిగి ఉన్న 32 ఏళ్ల మహిళకు మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆమెకు డాక్టర్లు చాలా ఖచ్చితత్వంతో సర్జరీని నిర్వహించారు. శిశువును మహిళ కడుపు నుంచి సురక్షితంగా బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం వెంటనే అమరావతి (మహారాష్ట్ర)కి పంపారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే పసికందులకు సర్జరీ చేసి, కడుపులో ఉన్న పిండాన్ని తొలగిస్తుంటారు. ఈ మహిళకు పుట్టిన బిడ్డకు కూడా ఇదే విధంగా అమరావతిలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జరీ చేస్తారని తెలుస్తోంది. గతంలో మన దేశంలోని బిహార్ రాష్ట్రంలో ఈ తరహా కేసు ఒకటి బయటపడింది. అప్పట్లో 40 రోజుల చిన్నారికి సర్జరీ చేసి లోపలి పిండాన్ని తొలగించారు.
Also Read :Gaza Strip : గాజాను మా ఆధీనంలోకి తీసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
ఏమిటీ ‘ఫెటస్ ఇన్ ఫెటు’ ?
ఇలాంటి కేసులు చాలా అరుదు అని బుల్ధానా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు.5లక్షల మందిలో ఒక గర్భిణికి మాత్రమే ఇలా జరుగుతుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా 200 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వాటిలోనూ మన దేశంలో కేవలం 5 కేసులే ఇలాంటివి వెలుగు చూశాయని డాక్టర్లు వివరించారు. మెడికల్ భాషలో ఈ తరహా పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’(Fetus In Fetu) అని పిలుస్తారన్నారు. ఒక బిడ్డ గర్భంలో రెండో శిశువు పెరుగుతోందనేది దీని అర్థం. ఈ బిడ్డకు ప్రసవం తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయని వైద్యులు తెలిపారు.