Site icon HashtagU Telugu

Health Tips: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ ముప్పు తప్పదు!

Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి ప్రపంచంలో చాలామంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. కంటి నిండా సరిగా నిద్రలేక సమయానికి నిద్రపోక ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక కంటి నిండా దరిద్రంగా నిద్రపోక లేనిపోని సమస్యలు వస్తున్నాయి. చాలామంది రాత్రిళ్ళు ఈ ఒత్తిడి కారణంగా పడుకోవడానికి ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తుంటారు. అయితే నిద్రలేమి సమస్య వల్ల మధుమేహం రక్తపోటు, గుండె జబ్బు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయట.

అలాగే చాలా రాత్రులు నిద్ర లేకుండా గడిపితే అది మధుమేహానికి దారితీస్తుందనీ చెబుతున్నారు. నిద్రలేమి రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందట. అలాగే నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందట. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోవడం వలన హార్మోన్లపై దాని ప్రభావం పడుతుందనీ, దీని వలన సంతానా ఉత్పత్తికి కారణమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, హార్మోన్ లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే నిద్రలేమి వలన ఈ హార్మోన్స్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండటం వలన సంతాన లేమికి కారణం అయ్యే అవకాశం ఉంటుందట.

అంతే కాకుండా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే మహిళలలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడటమే కాకుండా జీవగడియారాన్ని నియంత్రిస్తుందట. ఈ ప్రక్రియ రోజంతా జరగదు నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అలాంటి నిద్ర మనకి దూరమైనప్పుడు ఆ ప్రభావం ప్రతి ఉత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణం అవుతుంది అంటున్నారు. అతిగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. రాత్రిళ్ళు గంటలకొద్ది స్మార్ట్ ఫోన్లు చూస్తూ ఉండడం వల్ల తెలియకుండానే సమయం గడిచిపోతుంది. దాంతో నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి కంటి నిండా నిద్రపోయినప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు.