Kutki Health Benefits: కుట్కీ ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు కాస్త ఉపశమనం కోరుకుంటారు. మండుతున్న ఎండలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో చల్లదనాన్ని నింపుకోవాలంటే తప్పనిసరిగా మినుములను ఆహారంలో చేర్చుకోవాలి.

Kutki Health Benefits: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు కాస్త ఉపశమనం కోరుకుంటారు. మండుతున్న ఎండలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో చల్లదనాన్ని నింపుకోవాలంటే తప్పనిసరిగా మినుములను ఆహారంలో చేర్చుకోవాలి. ఈ మిల్లెట్లలో రాగి, జొన్న మొదలైనవి ఉన్నాయి. వేడిని అధిగమించడానికి మిల్లెట్లతో తయారు చేసిన పానీయాలను తీసుకోవచ్చు, ఇప్పుడు కుట్కీ గురించి తెలుసుకుందాం. కుట్కీ ఇదో రుచికరమైన మూలిక. దీనితో లివర్ టానిక్ తయారుచేస్తారు. ఇది లివర్‌ను శుభ్రం చేస్తుంది.ఆకలి పెంచుతుంది. జాండీస్ అంతు చూస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది. మంచి లివర్ కోసం… కుట్కీ టాబ్లెట్లు వాడితే మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కుట్కీ మిశ్రమానికి కావాల్సిన పదార్ధాలు: 2 టేబుల్ స్పూన్లు కుట్కీ, 2 టేబుల్ స్పూన్లు పచ్చి మూంగ్ పప్పు, 2 లవంగాలు, 1/4 దాల్చిన చెక్క, తరిగిన క్యారెట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి ఉప్పు మరియు మిరియాలు, నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ నూనె, కొన్ని కరివేపాకు, 1-2 పచ్చి మిర్చి , 3-4 కప్పుల వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ.

కుట్కీ తయారీ విధానం : ముందుగా కుట్కీని 20 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటితో ఫిల్టర్ చేసి ఆరనివ్వాలి. దీని తరువాత మూంగ్ పప్పును పొడిగా వేయించి, ముతకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో నూనె . లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు మరియు ఆవాలు వేసుకోవాలి. తరవాత అల్లం ముద్ద, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పసుపు, నీరు వేసి కలపాలి.కొంత సమయం తరువాత మిల్లెట్ మరియు మూంగ్ పప్పుతో పాటు కొంచెం ఉప్పు, నల్ల మిరియాలు మరియు ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరిగించి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు వేచి చూడాలి. కొంత సమయం తరువాత అందులో మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే రుచిగా బాగుంటుంది.

Read More: Health Tips: వేసవిలో ఈ ఫుడ్స్ తినకండి.. ఇవి బాడీ హీట్ ని పెంచటమే కాకుండా సమస్యలు కూడా..!