Finger On The Nose: ముక్కులో వేలు పెట్టుకోవడం అనేది చాలా మందికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుంది. కొందరు ముక్కు శుభ్రం చేసుకోవడానికి ఇలా చేస్తే, మరికొందరికి అది ఒక వ్యసనంలా మారుతుంది. అయితే ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల ముక్కు ఆకారం పెరుగుతుందా? దీనిపై ఆరోగ్య నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా?
అవును ముక్కులో పదేపదే వేలు పెట్టడం వల్ల ముక్కు పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. ముక్కులో వేలు పెట్టి లోపలి వైపు నొక్కడం వల్ల ముక్కులోని మెత్తటి ఎముకపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ‘లోయర్ లేటరల్ కార్టిలేజ్’ ఆకారం మారుతుంది. దీనివల్ల ముక్కు లోపలి ఎముక మారకపోయినా లోపల ఖాళీ ప్రదేశం పెరుగుతుంది. ఫలితంగా ముక్కు వెడల్పుగా, లావుగా కనిపిస్తుంది. రెండు వైపులా కాకపోయినా కనీసం ఒక వైపు ముక్కు ఆకారం మారి పెద్దదిగా కనిపించే ప్రమాదం ఉంది.
Also Read: ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!
ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల కలిగే ఇతర నష్టాలు
ముక్కు ఆకారం మారడమే కాకుండా ఈ అలవాటు వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గోళ్లలో ఉండే బ్యాక్టీరియా ముక్కు లోపలికి చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనివల్ల ముక్కులో కురుపులు లేదా మొటిమలు రావచ్చు. ముక్కు లోపల రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. వేలు పెట్టడం వల్ల అవి తెగిపోయి రక్తం కారుతుంది. ఇది పదేపదే జరిగితే రక్త నాళాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. ముక్కులోని సున్నితమైన కణజాలం దెబ్బతిని వాపు రావచ్చు లేదా గాయాలు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ముక్కు లోపల శాశ్వతమైన గుంటలు పడే అవకాశం ఉంది. ఈ అలవాటు వల్ల ముక్కు ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి.
మెదడుపై ప్రభావం
ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు మీ మెదడుకు కూడా ప్రమాదకరం. కొన్ని రకాల బ్యాక్టీరియా ముక్కు ద్వారా నేరుగా మెదడుకు చేరుకునే అవకాశం ఉందని, ఇది భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
