Kidney Stones: మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ల సమస్యతో ఎంతోమంది ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్య కలిగిన పలువురు రోగులపై రీసెర్చ్ చేసిన ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తల టీమ్ కీలక విషయాలను గుర్తించింది. అవేంటో మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?
అధ్యయన నివేదికలోని కీలక అంశాలు
- ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్‌లో భాగంగా మూత్రపిండాల్లో(Kidney Stones) రాళ్లున్న కొందరు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. ఆ మూడు రకాల శాంపిల్స్‌లో ఏయే మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది గుర్తించి, ఆ సమాచారాన్ని పోల్చి చూశారు. దీనివల్ల ఆయా రోగుల కిడ్నీలలో రాళ్లు ఏర్పడటానికి దారితీసిన ప్రధాన కారకాలను గుర్తించారు.
- చివరగా తేలింది ఏమిటంటే.. ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందని వెల్లడైంది.
- ఈ సమస్య 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణంగా మారిందని తేలింది.
- అధిక ఆక్సలేట్ లేదా తక్కువ కాల్షియం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతున్నాయని గుర్తించారు.
- ఢిల్లీ ఎయిమ్స్‌లోని యూరాలజీ, అనాటమీ, లేబొరేటరీ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులు డాక్టర్ ఛబ్రా స్వేషా, డాక్టర్ సేథ్ అమ్లేష్, డాక్టర్ అహ్మదుల్లా షరీఫ్, డాక్టర్ జావేద్ అహ్సాన్ ఖాద్రీ, డాక్టర్ శ్యామ్ ప్రకాష్, డాక్టర్ కుమార్ సంజయ్‌లు ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.
- ఇటీవలే దిల్లీ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పరిశోధకులు ఈ అధ్యయన నివేదికను విడుదల చేశారు.
Also Read :Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!
కిడ్నీలకు కోబాల్ట్, క్రోమియం గండం
- కోబాల్ట్ ఒక లోహ మూలకం. ఇది మెరిసే, బూడిద-గోధుమ రంగు లోహం.
- క్రోమియంను కూడా అనేక ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు.
- కోబాల్ట్, క్రోమియంల వల్ల గాలి, నేల కలుషితం అవుతాయి.
- క్రోమియం ఉనికి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివసించే వారికి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
- క్రోమియం ఉత్పత్తుల కారణంగా, మనిషి మూత్రపిండాలలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.