Site icon HashtagU Telugu

Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్

Nipah Virus Deaths

New Web Story Copy 2023 09 13t151100.618

Nipah Virus Deaths: కేరళలో నిఫా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తే నిఫా ప్రస్తుతం కేరళలో ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కేరళలో ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్ భారీన పడి చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. దీంతో కేరళ గవర్నమెంట్ అలర్ట్ అయింది. కొన్ని జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్ ప్రకటించింది. కన్నూర్, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్ ప్రకటించింది. కోజికోడ్‌ జిల్లాలో 9 ఏళ్ల బాలుడి సహా నలుగురికి నిపా వైరస్ నిర్దారణ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ జిల్లాలోని ఏడు పంచాయతీల్లో కంటెయిన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఇక అక్కడ పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలకు మాత్రమే అనుమతించారు. కేరళలోని కాలికట్ (కోజికోడ్) జిల్లాలో నిపా వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇద్దరు జ్వరంతో మృతి చెందారు. వైద్యులు నమూనాలను తీసుకుని పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.

Also Read: Flight: విమానం గాల్లో ఉండగా బాత్రూంలో అలాంటి పని చేసిన జంట.. చివరికి?