Snake Bite : పాముకాటు నుంచి క్షణాల్లో బ్రతికించే మొక్క ఇదే.. కాకపోతే !!

Snake Bite : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం "కాకోడ" అనే మొక్క (తెలుగులో ఆగాకర) ద్వారా పాముకాటుకు గురైన వారిని కాపాడుకుంటుంటారు

Published By: HashtagU Telugu Desk
Snakebite

Snakebite

వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పాముకాటు (Snake Bite) ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. వెంటనే వారు సమీప హాస్పటల్స్ కు తీసుకెళ్లి ప్రాణాలను కాపాడుతుంటారు. అయితే ఒక్కోసారి చికిత్స చేసినప్పటికీ ప్రాణాలు పోతుంటాయి. ఇక ఆసుపత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం “కాకోడ” అనే మొక్క (తెలుగులో ఆగాకర) ద్వారా పాముకాటుకు గురైన వారిని కాపాడుకుంటుంటారు. ఈ మొక్కలో ప్రాణాలను రక్షించే గుణం ఉంటుందని వారి నమ్మకం అలాగే ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే చెపుతుంటారు. ముళ్లతో కూడిన ఈ మొక్క ఆకులు పాముకాటు అనంతరం ఐదు నిమిషాల్లోనే విష ప్రభావాన్ని అణచివేయగలవని నమ్మకం ఉంది. ఇది శతాబ్దాలుగా గిరిజన వైద్యాల్లో వినియోగంలో ఉంది.

Virat Kohli: కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. విరాట్‌ను చూడాలంటే ఆగ‌స్టు వ‌ర‌కు ఆగాల్సిందే!

పాముకాటు తర్వాత బాధితుడు దగ్గరలో ఆసుపత్రి లేకపోతే, ప్రాథమిక చికిత్సగా కాకోడ ఆకులను దంచి కాటు చోట పూసి, గుడ్డతో కట్టడం, అలాగే ఆ రసాన్ని తాగించడం వంటివి సంప్రదాయ పద్ధతుల్లో ఉన్నాయి. ఈ మొక్కలో ఉన్న బయోయాక్టివ్ కాంపౌండ్లు విషం వ్యాప్తిని తగ్గించి, కణజాల నష్టాన్ని, పక్షవాతాన్ని కూడా నియంత్రించగలవని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఫార్మసీ పరిశోధకుడు డాక్టర్ కుంతల్ దాస్ కూడా ఈ మొక్కపై అధ్యయనం చేసి, దీనిలోని నెమలిపుంతల లక్షణాలను విశ్లేషించారు.

అయితే కాకోడను పూర్తిస్థాయి చికిత్సగా చూడటం ప్రమాదకరం. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించగలదు. నాగుపాము వంటి తీవ్ర విషపూరిత పాముల కాటుతో పోరాడాలంటే, ఏయస్‌వీ (యాంటీవెనమ్ సీరం)నే ఉత్తమమైన, శాస్త్రీయంగా నిర్ధారితమైన మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక కాకోడను మొదటిది అడుగు మాత్రంగా వాడినా, బాధితుడిని ఆసుపత్రికి తరలించడం అత్యవసరమని నిపుణుల సూచన.

  Last Updated: 04 Jun 2025, 11:03 PM IST