Site icon HashtagU Telugu

Morning Tea : మార్నింగ్ టీ బదులుగా ఇది తాగితే చాలు.. పొట్ట తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు?

Just Drink This Instead Of Morning Tea..

Just Drink This Instead Of Morning Tea..

చాలామందికి నిద్రలేచిన వెంటనే టీ, కాఫీలు తాగడం అలవాటు. అయితే ఎక్కువ శాతం మంది టీ (Tea)లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఉదయాన్నే కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే చేస్తూ ఉంటారు. దీనివల్ల క్రమంగా అనేక రకాలు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే మార్నింగ్ టీ (Morning Tea) తాగే అలవాటు ఉన్నవారు టీ (Tea) కి బదులుగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక పానీయాన్ని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఆ పానీయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

వేసవికాలంతో పాటు చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు. సందర్భం ఏదైనా కూడా చాలామంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారో వారు తొందరగా బరువు పెరుగుతారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ తో పాటు గ్యాస్ కూడా ఉంటుంది. కాబట్టి వీటిని బదులుగా నిమ్మకాయ చూసిన తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మకాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

ఒక నిమ్మకాయని పూర్తిగా మనం తీసుకుంటే 18.6 ml విటమిన్ సి మనకు లభిస్తుంది. ఈ నిమ్మకాయ జ్యూస్ తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరానికి కావాల్సిన ఎనర్జీ కూడా లభిస్తుంది. కాబట్టి నిత్యం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. అలాగే తొందరగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం అలవాటు చేసుకోవాలీ. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Also Read:  Solar Storm: దూసుకువ‌స్తున్న సౌర తుఫాను.. నేడు భూమిని తాకే అవ‌కాశం, ఇంటర్నెట్ సేవలకు ఇబ్బంది..!?