Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది. పలచబడటం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జుట్టు పలచబడినట్లు కనిపిస్తే నలుగురిలో కలవడానికి వెనకాడుతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఒత్తైన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. గుడ్డు.. తెల్లసొన.. గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా పట్టించి… అర్థగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని […]

Published By: HashtagU Telugu Desk
Is your hair thinning? Try following these tips!

Is your hair thinning? Try following these tips!

అమ్మాయిల అందం కేశాల్లోనే ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అమ్మాయిల్లో జుట్టు వూడిపోతోంది. పలచబడటం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జుట్టు పలచబడినట్లు కనిపిస్తే నలుగురిలో కలవడానికి వెనకాడుతుంటారు. ఈ నేపథ్యంలో జుట్టు పలచబడినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఒత్తైన కేశసంపద సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

గుడ్డు.. తెల్లసొన..

గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా పట్టించి… అర్థగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేసినట్లయితే… ఒత్తైన కేశాలు సొంతం చేసుకోవచ్చు. తెల్లసొన కలిపిన తర్వాత అందులో జుట్టుకు పెట్టుకునే నూనె, కొద్దిగా నీరు జతచేసి… ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా మర్దన చేయాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు:

జుట్టు పరిమాణానికి అనుగుణంగా రెండు లేదా మూడు చెంచాల మెంతులు తీసుకోవాలి. వాటిని నీటిలో 10 గంటలపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నుంచి 40 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో శుభ్రం చేసుకోవాలి. మెంతుల మిశ్రమంలో కాస్త కొబ్బరిపాలు కూడా కలిపి కేశాలకు పెట్టుకోవచ్చు.

ఉసిరి, శీకాకాయలతో…

తలస్నానానికి షాంపూలకంటే… సహజసిద్ధంగా తయారు చేసిన ఉసిరి, శీకాకాయ పొడులను ఉపయోగించినట్లయితే… పలచబడిన కేశాలను తిరిగి ఒత్తుగా మార్చుకోవచ్చు. ఇవి కురుల ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందించడంతో పాటు కుదుళ్ల వద్ద ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఫలితంగా ఆరోగ్యవంతమైన కేశాలను పొందవచ్చు.

ఉల్లిరసం…

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కేశాల ఎదుగుదలను బాగా ప్రేరేపిస్తుంది. ఒత్తైన కేశసంపద పొందాలనుకునే వారు వీటిని కూడా తమ చిట్కాల జాబితాలో చేర్చవచ్చు. ఉల్లిరసం తీసుకుని కుదుళ్ల వద్ద మర్దన చేయాలి. పదిహేను నిమిషాలపాటు ఈ విధంగా చేస్తే… జుట్టు తిరిగి పెరుగుతుంది.

కలబంద…

కలబంద గుజ్జును కేశాలకు, కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

ఆముదంతో…

ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో తీసుకోవాలి. కాస్త వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు చేరేలా చేతివేళ్లతో గుండ్రంగా మర్దన చేసుకోవాలి. కేశాలకు, కుదుళ్లకు నూనె సమానంగా పట్టించేలా చూసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టాలి. గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి క్రమం తప్పకుండా చేస్తే ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి.

  Last Updated: 13 Jun 2026, 04:00 PM IST