Coffee Vs Cow Dung : అంతా మాయ అన్నట్టుగా.. అంతా కల్తీ !! మనం తినే ప్రతీ ఆహార పదార్థంలో కల్తీ చేస్తున్నారు. అధిక లాభాలకు ఆశపడి కల్తీలకు తెగబడుతున్నారు. చివరకు కాఫీలో ఆవుపేడ పిడకల పొడిని కలిపేందుకు కూడా బరితెగిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి పలు ఆందోళనకర అంశాలు తాజాగా రాజస్థాన్ ఆహార భద్రతా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరణలో వెలుగులోకి వచ్చాయి.
Also Read : Cinnamon: మధుమేహం.. చెడు కొలెస్ట్రాల్.. రెండింటినీ క్షణాల్లో నియంత్రించేస్తుంది ఈ మసాలా..!
రాజస్థాన్ ఫుడ్ శాంపిల్స్ సర్వే వివరాలివీ..
- సర్వేలో భాగంగా రాజస్థాన్ ప్రభుత్వ ఆహార భద్రతా విభాగం(Coffee Vs Cow Dung) ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 30 వరకు 16,691 ఆహార శాంపిల్స్‌ను సేకరించింది.
- పర్యాటక రంగానికి పేరుగాంచిన జైపూర్ సిటీలో సేకరించిన ఫుడ్ శాంపిల్స్‌లో దాదాపు 30 శాతం వాటిలో కల్తీ ఉందని తేలింది.
- రాజస్థాన్ వ్యాప్తంగా సేకరించిన ఫుడ్ శాంపిల్స్‌లో 27 శాతం శాంపిల్స్ కల్తీమయంగా ఉన్నాయని వెల్లడైంది.
- ప్రపంచవ్యాప్తంగా సగటున 17 శాతం ఫుడ్ శాంపిల్స్‌లో కల్తీ ఉందని గతంలో పలు సర్వేలో గుర్తించాయి.
- మన దేశవ్యాప్తంగా సగటు 22 శాతం ఫుడ్ శాంపిల్స్‌లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పలు సర్వేల్లో గుర్తించింది.
- ఆహార కల్తీ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంది. ఇక రాజస్థాన్‌లో అత్యధిక ఆహార కల్తీ జైపూర్ నగరంలో జరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
- కారం పొడిలో మిరప కాడల పొడిని కూడా కలిపేశారని సర్వేలో తేలింది.
- చట్నీలలో రసాయన రంగులను కలిపారని వెల్లడైంది.
- గోధుమ రవ్వకు రంగు వేసి ధనియాల పొడిని అందులో కలిపారని గుర్తించారు.
- కచోరీ, సమోసాల తయారీకి వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడారని సర్వేలో వెల్లడైంది.
- ఈ సర్వేలో ఆహార కల్తీకి పాల్పడినట్లుగా గుర్తించిన వారికి జరిమానాలు విధించారు.
Also Read :Flu Vaccine : ఈ టీకా దగ్గు, జలుబు, జ్వరం , శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షిస్తుంది, ఎప్పుడు పొందాలో తెలుసుకోండి
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.