Men Vs Marriage : పెళ్లయ్యాక పురుషుల శరీర బరువు పెరుగుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది ? అసలు కారణమేంటి ? అనే దానిపై రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఆసక్తికర విషయాలను గుర్తించారు. అవేమిటో తెలుసుకుందాం..
Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ
పెళ్లయ్యాక పురుషులకు ఏమవుతోంది ?
- వివాహం తర్వాత పురుషుల్లో జరుగుతున్న శారీరక మార్పులపై పోలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. వారు ఆసక్తికర విషయాలను గుర్తించారు.
- పెళ్లి కాని పురుషులతో పోలిస్తే.. పెళ్లయిన పురుషులకు బరువు పెరిగే రిస్క్ 62 శాతం ఎక్కువ.
- పెళ్లి కాని మహిళలతో పోలిస్తే.. పెళ్లయిన మహిళలకు బరువు పెరిగే రిస్క్ కేవలం 39 శాతమే.
- పెళ్లి తర్వాత పురుషులకు(Men Vs Marriage) ఊబకాయం ముప్పు మూడు రెట్లు పెరుగుతుంది.
- పెళ్లయిన తర్వాత పురుషులు తినే ఆహారం మోతాదు పెరుగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఈ కారణాలే ఊబకాయానికి దారితీస్తాయి.
- పురుషులకు పెళ్లయ్యాక.. మొదటి ఐదేళ్లలోనే శరీర బరువు పెరుగుతోందని గుర్తించారు.
- పెళ్లయిన తర్వాత శరీర బరువును నిర్వహించే విషయంలో పురుషుల కంటే మహిళలే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
- పెళ్లి కాని వారి కంటే.. పెళ్లయిన పురుషుల శరీర బరువు 1.4 కేజీలు ఎక్కువగా ఉంటుంది.
అధ్యయనంలో భాగంగా..
ఈ రీసెర్చ్‌లో భాగంగా వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు పోలాండ్‌కు చెందిన సెంటర్ నేషనల్ పాపులేషన్ హెల్త్ ఎగ్జామినేషన్ సర్వే నుంచి 2,405 మంది పురుషుల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. 50 ఏళ్ల వయస్సు కలిగిన పురుషుల్లో 35.3 శాతం మంది సాధారణ బరువును కలిగి ఉన్నారు. 38.3 శాతం మంది పురుషులకు అధిక బరువు ఉంది. 26.4 శాతం మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. పురుషుల అధిక బరువు, వయస్సు, వైవాహిక స్థితి, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం ఉందని గుర్తించారు.