Tongue Health Tips: నాలుక తెల్లగా ఉందా? ఆ వ్యాధుల ముప్పు..

మన నాలుక సాధారణంగా ఎరుపు (Red) రంగులో ఉంటుంది. కానీ కొన్నికొన్ని సార్లు దాని రంగు మారిపోతుంది.

మన నాలుక (Tongue) సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. కానీ కొన్నికొన్ని సార్లు దాని రంగు మారిపోతుంది. ఇలా మారిపోయే నాలుక రంగులను బట్టి మన హెల్త్ స్టేటస్ ను గుర్తించవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, అది ఆరోగ్యంలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీని వల్ల నాలుకపై తెల్లటి పూత వస్తుంది. అలాగే నాలుక పాలిపోతే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉన్నాయని అర్థం. అందుకే డాక్టర్స్ మన నాలుక చూపించమని అడుగుతారు. నాలుక (Tongue) రంగుల లోగోట్టు ఏమిటి ? దానికి హోమ్ రెమెడీస్ ఏమిటి ? అనే దానిపై మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక్కో రంగు.. ఒక్కో సమస్యకు సంకేతం

  1. నాలుక ముఖ్యంగా తీవ్రమైన ఎరుపు, పసుపు, నీలి, తెలుపు, నలుపు, ఊదా రంగుల్లో కనిపిస్తుంటుంది. ఈ ఒక్కో రంగు మనలో ఒక్కో ఆరోగ్య సమస్యకు సంకేతంగా నిలుస్తుంది.
  2. నాలుక తెల్లగా ఉంటే శరీరంలో నీటి కొరత ఉన్నట్లు. వీటిని నోటి ఆరోగ్య సమస్యలు, సిఫిలిస్‌ వంటి వ్యాధుల ప్రారంభ సంకేతాలుగా అనుమానించాలి.
  3. ఈ నాలుక పైభాగం తెల్లటి పూతలా కనిపిస్తే పేలవమైన నోటి పరిశుభ్రతను సూచిస్తుంది. ఇది ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం కూడా కావచ్చు.
  4. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా నాలుకపై బ్యాక్టీరియా ప్రభావం పెరుగుతుంది. తెల్లటి పొర నాలుకపై గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.
  5. క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా నాలుక తెల్లగా మారే అవకాశాలుంటాయి.
  6. నోరు పొడిబారడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల కూడా నాలుక తెల్ల రంగులోకి మారడం మొదలవుతుంది.
  7. నాలుకపై ఏర్పడే పూత కాటేజ్ చీజ్ పొరలా కనిపిస్తే.. అది ల్యూకో ప్లాకియాని కలిగి ఉండవచ్చునని భావించాలి.
  8. ఆహార కణాలు, జెర్మ్స్, మృతకణాలు నాలుక ఉపరితలంపై పెరిగినప్పుడు కూడా తెలుపు రంగు వస్తుంది.
  9. నీరు పుష్కలంగా త్రాగటం, మంచి నోటి పరిశుభ్రత నిర్వహించడం ద్వారా నాలుక తెలుపు రంగును అధిగమించవచ్చు.

తెలుపు రంగు నాలుకకు (Tongue) ఇలా చెక్

తెలుపు రంగు నాలుకతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలి. స్వీట్లు తినొద్దు. తెలుపు రంగు ఎక్కువ రోజుల పాటు నాలుకను వదలకపోతే వైద్యుడిని సంప్రదించి ఆయన పర్యవేక్షణలో అవసరమైన కొన్ని సప్లిమెంట్లను తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ నోరు వీలైనంతగా హైడ్రేటెడ్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి. నాలుక తెల్లగా కనిపిస్తే ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించాలి. ఫ్లోరైడ్ ఉన్న నీటిని మాత్రమే తాగాలి. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. ప్రతిరోజూ దంతాలను ఫ్లాసింగ్‌ చేసుకోవాలి.

తెల్లని నాలుక పోవాలంటే ఇంటి చిట్కాలు..

ఉప్పునీటితో శుభ్రం చేయడం

ఒక టేబుల్ స్పూన్ ఉప్పును ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలపండి. దాన్ని మీ నోటిలో సుమారు 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మి వేయండి. ఉప్పులో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. ఇది మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి, నాలుకపై ఏర్పడిన తెల్లటి పొరను తగ్గించడానికి సహాయపడుతుంది.

టంగ్ స్క్రాపర్

మీ నాలుకపై తెల్లటి పూతను తొలగించడానికి మరొక సులభమైన , సమర్థవంతమైన పద్ధతి నాలుక స్క్రాపర్‌ని ఉపయోగించడం. ఇది మీ నాలుకపై ఉన్న బ్యాక్టీరియా , శిధిలాల పొరను సున్నితంగా తొలగిస్తుంది. స్క్రాపర్‌ను మీ నాలుక వెనుక భాగంలో ఉంచండి. ఆ తర్వాత దానిని మెల్లగా ముందుకు లాగండి. ప్రతి స్ట్రోక్ మధ్య దానిని శుభ్రం చేయండి.

ప్రోబయోటిక్స్

పెరుగు లేదా కేఫీర్ వంటి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీ నోటిలో బ్యాక్టీరియా యొక్క ఆరోగ్యకరమైన సమతుల్యత సాధ్యం అవుతుంది. ప్రోబయోటిక్స్ హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి . మీ నాలుకపై తెల్లటి పొర ఏర్పడకుండా ఇవి నిరోధిస్తాయి.

ఆయిల్ పుల్లింగ్

ఒక చెంచా కొబ్బరి నూనెను 15-20 నిమిషాల పాటు మీ నోటిలో వేసి పుక్కిలించండి. నూనె సహజమైన క్లెన్సర్‌గా పని చేస్తుంది. మీ నోటి నుంచి బ్యాక్టీరియా , చెత్తను ఇది తొలగిస్తుంది. నాలుకపై తెల్లటి పొర ఏర్పడడాన్ని ఇది తగ్గిస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా అనేది మీ నోటిలోని యాసిడ్స్ ను న్యూట్రల్ చేస్తుంది. నాలుకపై బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది.  ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కొద్ది మొత్తంలో నీళ్లతో కలిపి పేస్ట్ లా తయారు చేసి, మీ నాలుకను బ్రష్ చేయండి.  వృత్తాకార కదలికలో సున్నితంగా బ్రష్ చేయండి. తెలుపు రంగు ఉన్న నాలుక ఏరియాలపై బ్రష్ చేయాలి.

Also Read:  Shiva Temples: ఒకే సరళ రేఖ పై 7 శివాలయాలు ఎలా నిర్మించారంటే?