శీతాకాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది?

శీతాకాలం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో తేమ తగ్గడం వల్ల దాని ప్రభావం నేరుగా మన జుట్టు, చర్మంపై పడుతుంది.

Published By: HashtagU Telugu Desk
Hair Falls

Hair Falls

Hair Falls: శీతాకాలం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో తేమ తగ్గడం వల్ల దాని ప్రభావం నేరుగా మన జుట్టు, చర్మంపై పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుండి ఎలా బయటపడచ్చో ఆరోగ్య నిపుణులు సూచించారు.

శీతాకాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది?

చుండ్రు: చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల తల చర్మం పొడిబారి చుండ్రు పెరుగుతుంది. దీనివల్ల జుట్టు వేర్లు బలహీనపడి రాలిపోతాయి.

డీహైడ్రేషన్: చలికాలంలో దాహం తక్కువగా వేయడం వల్ల చాలామంది నీళ్లు తక్కువగా తాగుతారు. దీనివల్ల శరీరంలో తేమ తగ్గి జుట్టుపై ప్రభావం చూపుతుంది.

వేడి నీటి స్నానం: చాలా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు కోల్పోయి జుట్టు నిర్జీవంగా మారుతుంది.

పోషకాహార లోపం: సరైన పోషకాలు లేని ఆహారం, ఒత్తిడి, క్రమరహిత జీవనశైలి కూడా కారణమవుతాయి.

Also Read: ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

చర్మ సమస్యలు

చలికాలంలో చర్మం ఎదుర్కొనే సాధారణ సమస్యలు ఇవే!

పొడి చర్మం: చర్మం పొడిబారి, కాంతివిహీనంగా మారుతుంది.

పగిలిన పెదవులు: గాలిలో తేమ లేకపోవడం వల్ల పెదవులు ఎండిపోయి పగులుతాయి. కొన్నిసార్లు నొప్పి కూడా వస్తుంది.

పగిలిన మడమలు: మడమలు పగిలి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది.

దురద- దద్దుర్లు: చర్మంపై విపరీతమైన పొడిదనం వల్ల దురద, ఎర్రటి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

ఎగ్జిమా, సోరియాసిస్: ఇప్పటికే ఈ సమస్యలు ఉన్నవారికి చలికాలంలో లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.

నివారణ మార్గాలు-సలహాలు

శీతాకాలంలో మీ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.

నీరు ఎక్కువగా తాగాలి: చలిగా ఉన్నా సరే శరీరంలో తేమ కోసం తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

తేమను కాపాడుకోండి: ప్రతిరోజూ మంచి మాయిశ్చరైజర్ రాసుకోండి. స్నానానికి మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి.

నూనె వాడకం: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి నూనె, ఆవ నూనె లేదా బాదం నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయండి.

సున్నితమైన ఉత్పత్తులు: గాఢత ఎక్కువ ఉన్న సబ్బులు, షాంపూలను వాడకండి.

ఆహారం: ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.

  Last Updated: 23 Dec 2025, 08:59 PM IST